Site icon HashtagU Telugu

Chiranjeevi : బీజేపీ వైపు టాలీవుడ్ పెద్ద‌?

Chiru Bjp

Chiru Bjp

మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం మ‌రోసారి టాలీవుడ్ పెద్ద‌రికాన్ని తెలియ‌చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోన్న సాంస్కృతిక మ‌హోత్స‌వాల‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి సిద్ధం అయ్యాడు. భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని నింపుకున్న భార‌త‌దేశ సాంస్కృతిక సంప‌ద‌ను కాపాడే ప్ర‌య‌త్నం మోడీ స‌ర్కార్ చేస్తోంది. అందుకోసం చిరంజీవి ప్ర‌య‌త్నం చేయ‌డం సినీవ‌ర్గాల‌ను ఆలోచింప చేస్తోంది.టాలీవుడ్ పెద్ద ఎవ‌రు అనేదిదానిపై చాలా కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ‌రావు ఇచ్చిన `పెద్దరికం` వార‌స‌త్వాన్ని తీసుకోవాల‌ని మంచు ఫ్యామిలీ ప్ర‌య‌త్నం చేసిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. అదే స‌మ‌యంలో చిరంజీవిని సినీ పెద్ద‌గా ఫోక‌స్ చేసిన వాళ్లు ఉన్నారు. ఆ క్ర‌మంలో నంద‌మూరి, కొణిద‌ల ఫ్యామిలీ మ‌ధ్య కొంత కాలం `పెద్ద‌రికం` అనే అంశంపై అంత‌ర్గ‌త వార్ జ‌రిగింది. కోవిడ్ సంద‌ర్భంగా పేద కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి చిరంజీవి ప్ర‌య‌త్నం చేశాడు. ఆ త‌రువాత జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో ప్రాంతీయత‌త్త్వం తెర‌మీద‌కు వ‌చ్చింది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మా ఎన్నిక‌ల రంగంలోకి దిగ‌డంతో గంద‌ర‌గోళం రేగింది. ఆ సంద‌ర్భంగా టాలీవుడ్ పెద్ద అనే అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఆ సమ‌యంలో చిరంజీవి మౌనం వ‌హించాడు.

సినీ కార్మికుల ఇళ్ల స్థలాల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ను మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అంట్ టీం ఆ మ‌ధ్య క‌లిసింది. ఏపీ సీఎం జ‌గ‌న్ ను క‌లిసి సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం స‌హ‌కారం అందించాల‌ని తొలి భేటీలో చిరు అండ్ టీం కోరింది. భూములు పంచుకోవ‌డానికి సీఎంల‌ను క‌లిశార‌ని ఆ సంద‌ర్భంగా హీరో బాల‌క్రిష్ణ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో దూమారం రేపాయి. ఆ త‌రువాత సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విధానంపై ఏపీ స‌ర్కార్ తీసుకొచ్చిన జీవో టాలీవుడ్ ను క‌దిపేసింది. ఆ స‌మ‌యంలో చిరంజీవి రెండుసార్లు సీఎం జ‌గ‌న్ ను క‌లిశాడు. చేతులెత్తి న‌మ‌స్కారం చేస్తూ సినీ ఇండిస్ట్రీ కోసం వేడుకున్నాడు.ఏపీ సీఎం జ‌గ‌న్ రెండుసార్లు వ్య‌క్తిగ‌తంగా చిరంజీవిని ఇంటికి ఆహ్వానించాడు. సినీ పెద్ద‌గా చిరంజీవిని ఆయ‌న భావించాడు. సినీ ప‌రిశ్ర‌మ‌ స‌మ‌స్య‌ల‌పై చిరంజీవితో చ‌ర్చించాడు. ఆనాడే సినీ పెద్ద‌గా మ‌రోసారి మెగాస్టార్ ఫోక‌స్ అయ్యాడు. ఆ ఇష్యూలో నంద‌మూరి, మంచు ఫ్యామిలీ మౌనం వ‌హించింది. ఇప్పుడిప్పుడే మంచు మోహ‌న్ బాబు స్వ‌రాన్ని స‌వ‌రించుకుంటున్నాడు. ఎన్నిక‌ల ముందు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం ద్వారా మోస‌పోయానంటూ తెర‌వెనుక డైలాగులు వినిపిస్తున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌.తాజాగా త్రిబుల్ ఆర్ పీ రిలీజ్ ఫంక్ష‌న్లో టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి టాలీవుడ్ పెద్ద చిరంజీవి అంటూ ప్ర‌క‌టించాడు. ఆయ‌న సినీ ముద్దు బిడ్డ మాత్ర‌మే కాదు..పెద్ద కూడా అంటూ తేల్చేశాడు. ఆ ప్ర‌క‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రియాక్గ్ కాలేదు. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి చేసిన ప్ర‌క‌ట‌న‌కు బ‌లం చేకూరేలా కేంద్రం ప్ర‌మోట్ చేస్తోన్న జాతీయ సాంస్కృతిక మ‌హోత్స‌వాల‌ను మెగాస్టార్ వీడియో ద్వారా ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఉత్స‌వాల్లో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో రాజమండ్రిలో క‌ళాకారులు వివిధ క‌ళ‌ల‌ను ప్రదర్శించబోతున్నారు. అలాగే, ఈ నెల 29, 30 తేదీల్లో వరంగల్ లోనూ హైదరాబాదులో ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వ‌హించ‌నున్నారు. ఆ ఉత్సవాలను విజయవంతం చేయ‌డానికి చిరంజీవి న‌డుం బిగించాడు.

రాజ‌కీయంగా మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇంకా స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌లేదు. 2019 నుంచి ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ తో రెండుసార్లు భేటీ జ‌రిగిన సంద‌ర్భంగా చిరంజీవి వైసీపీలోకి వెళ్ల‌బోతున్నాడని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు మోడీ స‌ర్కార్ నిర్వ‌హిస్తోన్న జాతీయ సాంస్కృతిక మ‌హోత్స‌వాల‌ను మెగాస్టార్ ప్ర‌మోట్ చేస్తూ వీడియో విడుద‌ల చేసిన త‌రువాత బీజేపీ ఎఫెక్ట్ ఆయ‌న పై ప‌డింది. రాబోవు రోజుల్లో క‌మ‌ల‌ద‌ళంలోకి వెళ్ల‌నున్నాడా? అనే అనుమానం టాలీవుడ్ లోని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ప‌వ‌న్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు. అంతేకాదు, బీజేపీ ఏపీ అధ్య‌క్షుడి కోసం ఆ పార్టీ చాలా కాలంగా చూస్తోంది. ఆ ప‌ద‌విని చిరంజీవికి అప్ప‌గించ‌డం ద్వారా రాజ‌కీయ ల‌బ్దిపొందాల‌ను క‌మ‌ల‌ద‌ళం భావిస్తోంద‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌. జ‌న‌సేన చీఫ్ గా ప‌వ‌న్‌, బీజేపీ ఏపీ చీఫ్ గా చిరంజీవి ఒకే వేదిక‌పై క‌నిపిస్తే రాజ‌కీయాల్లో ఆ కిక్ వేరంటున్నారు మెగా అభిమానులు. సో..చిరంజీవి విడుద‌ల చేసిన వీడియో టాలీవుడ్ పెద్ద‌గా గుర్తింపు ఇస్తుంటే, రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌ల‌కు దారితీస్తోంది.