Site icon HashtagU Telugu

Chiranjeevi : పవన్ కళ్యాణ్ కి ఎందుకు విరాళం ఇచ్చాడో చెప్పిన మెగాస్టార్.. నేను సైతం..

Chiranjeevi said why he Donated to Pawan Kalyan Janasena Party Tweet Goes Viral

Chiranjeevi said why he Donated to Pawan Kalyan Janasena Party Tweet Goes Viral

Chiranjeevi : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జనసేన(Janasena) పార్టీ కోసం నేడు చిరంజీవి విరాళం ఇచ్చారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, పలువురు జనసేన నాయకులు నేడు చిరంజీవి పిలుపు మేరకు విశ్వంభర సెట్స్ కి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అయిదు కోట్ల రూపాయల చెక్ జనసేన పార్టీ విరాళంగా అందించారు. ఇన్నాళ్లు ఎప్పుడు అధికారికంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు, జనసేన పార్టీ గురించి మాట్లాడని మెగాస్టార్ ఇప్పుడు ఎన్నికల ముందు పిలిచి విరాళం ఇవ్వడంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది.

అయితే పవన్, చిరంజీవి, నాగబాబు.. ఇలా ముగ్గురు మెగా బ్రదర్స్ కలవడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలని చిరంజీవి కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి ఎందుకు విరాళం ఇచ్చారో తెలిపారు.

చిరంజీవి పవన్ కళ్యాణ్ కి విరాళం అందిస్తున్న ఫొటోలు, తమ్ముళ్ళతో కూర్చొని మాట్లాడే ఫోటోలని షేర్ చేస్తూ.. అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను అని ఇండైరెక్ట్ గా రాజకీయ కోణంలో పోస్ట్ చేశారు. దీంతో చిరంజీవి పోస్ట్ వైరల్ గా మారింది.

చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వెళ్లి బయటకి వచ్చినవారే. చిరంజీవి అలాగే నిలబడి పోరాడి ఉంటే ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళు అని కూడా అనుకుంటారు. ఇన్నేళ్లు తమ్ముడు పార్టీకి బయటకి తెలియకుండా సపోర్ట్ చేసినా నేడు ఎన్నికల ముందు తమ్ముడి పార్టీకి అందరికి తెలిసే విధంగా సపోర్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. చిరంజీవి రంగంలోకి దిగారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, కాపుల్లో ఓ కొత్త ఉత్సాహం వచ్చింది. మరి ఎన్నికల్లో చిరంజీవి పవన్ కి ఇంకేవిధంగా సహాయం చేస్తాడో చూడాలి.

 

Also Read : Chiranjeevi – Janasena : జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం.. విశ్వంభర షూటింగ్ సెట్‌లో..