Tollywood Donation: ఏపీ వరదబాధితులకు బాసటగా నిలిచిన చిరు, రాం చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్

ఏపీలో ఇటీవల భారీ వర్షాలకు ప్రాణ, ధన, పంట నష్టం జరిగింది. పలుచోట్ల వరదలతో జనజీవనం స్తంభించిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Chiru Mahesh Ntr20102020 C Imresizer

Chiru Mahesh Ntr20102020 C Imresizer

ఏపీలో ఇటీవల భారీ వర్షాలకు ప్రాణ, ధన, పంట నష్టం జరిగింది. పలుచోట్ల వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. తాజాగా వరద బాధితులకు టాలీవుడ్ సినీనటులు బాసటగా నిలిచారు.

వరద బాధితుల కోసం తనవంతుగా 25 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్. చిరంజీవి ప్రకటించారు.
ఏపీలో వచ్చిన వరదల వల్ల తాను ఎంతగానో బాదపడ్డానని చిరు తెలిపారు. తనతో పాటు రామ్ చరణ్ కూడా సీఎం సహాయనిధికి 25లక్షల ఆర్థిక సహాయం అందించారు.

వరదల వల్ల ఎంతోమంది తమజీవానాధారం కోల్పోయారని, కష్టపడి పండించిన పంటలు నీటిలో మునగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం బాధ కల్గించిందని సినీనటులు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. వాళ్లిద్దరూ సీఎం రిలీఫ్ ఫండ్ కి చెరో 24 లక్షలు సహాయంగా ప్రకటించారు.

  Last Updated: 01 Dec 2021, 08:59 PM IST