Site icon HashtagU Telugu

Tollywood vs CM Jagan: చిరు వ్యాఖ్యల్ని సమర్ధించిన వైసీపీ రెబల్ ఎంపీ

Tollywood vs CM Jagan

New Web Story Copy 2023 08 08t163128.208

Tollywood vs CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. ఏపీ పభుత్వంపై ఏనాడూ స్పందించని మెగాస్టార్ తాజాగా సీఎం జగన్ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని, రోడ్ల పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టులు నిర్మించాలని, ప్రత్యేకహోదా గురించి పోరాటం చేయాలనీ సూచించారు. అవన్నీ కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటి అని చిరంజీవి ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం చిరు కామెంట్స్ రాజకీయ పరంగా చర్చకు దారితీశాయి.

చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు. సీఎం జగన్ ప్రభుత్వం గురించి చిరంజీవి బుద్ధి వచ్చేలా మాట్లాడారని అన్నారు. సినిమా పరిశ్రమ విషయంలో సీఎం జగన్ వైఖరిపై చిరు మాట్లాడటంపై హర్షం వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం రోడ్లు, అభివృద్ధి, ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ జగన్ కి కూడా నోటీసులు ఇచ్చే ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. విచారణకు హాజరయ్యేందుకు జగన్ మూడు నెలల సమయం అడిగి ఉంటారని జోస్యం చేశారు.

ఏపీలో జనసేన, వైసీపీ మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్య చేపట్టిన వారాహి యాత్రంలో భాగంగా సీఎం జగన్ ని ఓ రేంజ్ లో విమర్శించారు. జగ్గు భాయ్ అంటూ ఎండగట్టారు. ఒకానొక సమయంలో ఇరు పార్టీలు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. మరో అంశం ఏంటంటే ఈ మధ్య పవన్ నటించిన బ్రో సినిమాపై రాజకీయ నీడలు అలుముకున్నాయి. ఆ సినిమాలో అంబటి రాయుడు చేసిన డ్యాన్స్ ని చేర్చడం ద్వారా వివాదం చెలరేగింది. దీంతో సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకుల మధ్య మరింత వైరం పెరిగింది. ఇక తాజాగా చిరు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.

Also Read: Cricket World Cup 2023: సెప్టెంబర్ 5 డెడ్ లైన్.. ప్రపంచకప్‌ లో పాల్గొనే జట్లకు ఐసీసీ కీలక సూచన..!