Site icon HashtagU Telugu

RGV Vs Jagan : వ‌ర్మకు ‘మెగా’ మ‌ద్ధ‌తు..జ‌గ‌న్ కు సినిమా చూపించేలా..!

Rgv Chiru Nagababu

Rgv Chiru Nagababu

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అలియాస్ ఆర్జీవీ స‌మాజం గురించి ఎప్పుడూ ప‌ట్టించుకోడు. ఈ స‌మాజంతో నాకు ప‌నిలేదని బాహాటంగా చెబుతుంటాడు. సినిమా వ్యాపారం అంటూ ప‌లుమార్లు చెప్పాడు. గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ సినిమాను బాలీవుడ్ హీరోయిన్ మియా మాల్కోవాతో తీశాడు. ఆ సంద‌ర్భంగా సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై తిరుగ‌బ‌డ్డారు. బ్లూ ఫిల్మ్ లు త‌ప్పు కాదంటూ ఆయ‌న ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. పైగా ఉద‌యం లేవ‌గానే బ్లూ ఫిల్మ్ ల‌ను చూస్తానంటూ ప్ర‌క‌టించాడు. ఈ స‌మాజం ఏమైతే..నాకేంటి నా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఉంటానంటూ తెగేసి చెప్పే వివాదాల వ‌ర్మ సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు మా ఇష్ట‌మంటూ వాదిస్తున్నాడు.స్త్రీల తొడ‌ల‌ను ఎంజాయ్ చేస్తానంటూ వ‌ర్మ క్రేజ్ గా చెప్పుకుంటాడు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తూ త‌ర‌చూ మీడియా ప్ర‌చారాన్ని కోరుకునే ఆయ‌న్ను స‌మాజం ఎప్పుడో వ‌దిలేసింది. వ‌ర్మ‌కు ఉన్న‌ తిక్క‌ను ఆయ‌న‌కే వ‌దిలేశారు. హ‌ఠాత్తుగా ఇప్పుడు సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ నియంత్ర‌ణ అంశంలోకి దూరాడు. నా సినిమా నా ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌ల‌కు అమ్ముకుంటానంటూ వాదిస్తున్నాడు. వినోద సేవ చేసే సినిమాపై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ ఏంటి? అంటూ మంత్రి పేర్ని నానికి ప‌ది ప్ర‌శ్న‌ల‌ను సంధించాడు.

సినిమా నిత్యావ‌రాల కింద‌కు వ‌స్తుందా? అత్య‌వ‌స‌రాల కింద‌కు వ‌స్తుందా? వినోద సేవ కింద‌కు వ‌స్తుందా? అనే ప్ర‌శ్న‌ల‌తో ఏపీ ప్ర‌భుత్వాన్ని వ‌ర్మ నిల‌దీస్తున్నాడు. ఒక వేళ నిత్యావ‌సరాలు, అత్య‌వ‌స‌రాల కింద‌కు వ‌స్తే…స‌బ్సీడీలు ఇవ్వాల‌ని కోరుతున్నాడు. వినోదం అనేది సేవారంగం కింద‌కు వ‌స్తుంద‌ని చెబుతున్నాడు. సినిమా టిక్కెట్ల‌ను నియంత్రించే హ‌క్కు ప్ర‌భుత్వాల‌కు లేదంటూ కొత్త కోణాన్ని లేవ‌తీస్తున్నాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఒక వీడియోను కూడా వ‌ర్మ విడుద‌ల చేశాడు. ఆన్ లైన్‌, టిక్కెట్ల ధ‌ర‌ల‌ నియంత్ర‌ణ ఎందుకు చేశార‌ని నిల‌దీస్తున్నాడు. ఫుల్ మ‌త్తులో ఆయ‌న మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ ప‌ద్ధ‌తి కోసం కొన్నేళ్లుగా స్వ‌ర్గీయ డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ రావు పోరాటం చేసిన విష‌యం వ‌ర్మ‌కు తెలియ‌దేమో. ఇటీవ‌ల చిరంజీవి, నాగార్జున అండ్ టీం తాడేప‌ల్లి నివాసంలో జ‌గ‌న్ ను క‌లిసిన‌ప్పుడు వాళ్లు కోరిందేమిటో ఆయ‌న తెలుసుకోవాలి. వాళ్లు ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం ఆన్ లైన్‌, సినిమా టిక్కెట్ల నియంత్ర‌ణ‌పై జీవోల‌ను విడుద‌ల చేసింది. ఆ విష‌యాన్ని వ‌ర్మ గుర్తుంచుకోవాలి. ఇవ‌న్నీ గ‌మ‌నించ‌కుండా టిక్కెట్ల‌ను ఎంత ధ‌ర‌కైనా అమ్ముకునే హ‌క్కు ఉందంటూ వాదిస్తున్నాడు.

వాస్త‌వానికి థియేట‌ర్ల‌లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల్ని నిర్ణ‌యించే అధికారం ప్ర‌భుత్వానికి ఉంద‌ని సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం 1970 స్ప‌ష్టం చేస్తోంది. ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌లో ఇచ్చే సౌక‌ర్యాల‌కు అనుగుణంగా టిక్కెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని చ‌ట్టం చెబుతోంది. హీరో, డైరెక్ట‌ర్లు, హీరోయిన్ల రెమ్యునిరేష‌న్ కు అనుగుణంగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని ఏ చ‌ట్టం ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. ఈ విష‌యాన్ని తెలుసుకోలేని వ‌ర్మ సినిమా టిక్కెట్ల‌ను ఇష్టానుసారంగా పెంచుకుంటామంటూఏపీ ప్ర‌భుత్వంపై యుద్ధానికి దిగాడు.వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసే వ‌ర్మ అంటే ఎప్పుడూ మెగా హీరోలు దూరంగా ఉంటారు. ప్ర‌త్యేకించి ప‌వ‌న్ ఫేవ‌రేట్ హీరో అంటూనే వ‌ర్మ ఒకప్పుడు శ్రీరెడ్డికి మ‌ద్ధ‌తు ప‌లికాడు. ఆ రోజు నుంచి ప‌వ‌న్ అభిమానులు ఆయ‌న మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా బూతులు తిడుతుంటారు. ఆప్ప‌ట్లో ఆయ‌న్ను వెంటాడారు. ఆ స‌మ‌యంలో మెగా ఫ్యామిలీ హీరోలు అంతా వ‌ర్మ‌ను వ్య‌తిరేకిస్తూ ఒక యుద్ధాన్ని చేశారు. తాజాగా సినిమా టిక్కెట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి వ‌ర్మ విడుద‌ల చేసిన 10 ప్ర‌శ్న‌ల వీడియోకు నాగబాబు మ‌ద్ధ‌తు ప‌లికాడు. తాను అడ‌గాల‌నుకున్న ప్ర‌శ్న‌ల‌న్నింటినీ వీడియో ద్వారా వ‌ర్మ అడిగేశాడ‌ని కితాబు ఇచ్చాడు. మొత్తం మీద సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ నియంత్ర‌ణ అంశం మెగా హీరోల‌ను, వ‌ర్మ‌ను క‌లిపింద‌న్న‌మాట‌.