Site icon HashtagU Telugu

Pawan Kalyan Properties : పవన్ ఆస్తులను చిరంజీవి కొనుగోలు చేస్తున్నాడా..?

Pawan Chiru

Pawan Chiru

తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద ఆలోచనే చేసినట్లు తెలుస్తుంది. ఈరోజుల్లో పోగొట్టుకున్న ఆస్తులు మళ్లీ కూడబెట్టుకోవడం అంటే ఎంతో కష్టం..అలాంటిది తమ్ముడు రాజకీయాల కోసం కష్టపడి కట్టుకున్న ఇళ్లులు , భూములు అమ్మెందుకు సిద్ధం అయ్యాడని తెలిసి చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో అయితే డబ్బే ప్రదానం. ఎన్నికల ప్రచారం లో ఎంత ఖర్చుపెట్టారు..ఎన్ని మందుసీసాలు పంపిణి చేసారు..ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు పంచారు..ఎంతమందిని వెనకేసుకొని తిరిగాం అనేది ఓటర్లు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి పోలింగ్ పూర్తి అయ్యేవరకు ఓటర్లకు , కార్యకర్తలకు , నేతలకు డబ్బు పంచుతూనే ఉండాలి. అప్పుడే గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే అంత గెలుపు అనేది ఉంటుంది. అందుకే ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి వందల కోట్లు పట్టుకొని నిల్చువాలి. అభ్యర్ధే ఆ రేంజ్ లో ఖర్చు చేయాలంటే..పార్టీ అధినేత ఎంత ఖర్చు పెట్టాలో ఓసారి ఆలోచించండి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ కోట్ల కోసం సొంత ఆస్తులు (Properties ) అమ్ముతున్నట్లు (Selling ) గత కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాల్లో రోజుకు రెండు కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్..ప్రజలకు ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరి నుండి ఆయనకు మంచి కంటే చెడె ఎక్కువ జరుగుతుంది. పనికిరాని వారితో మాటలు పడాల్సి వస్తుంది..పదేళ్లుగా సినిమాలు చేస్తే వచ్చిన డబ్బుతో పార్టీ నడిపిస్తూ..ఆపదలో ఉన్న వారిని ఆర్ధికంగా ఆదుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల బరిలో నిల్చున్నాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన పవన్…ఇప్పుడు తన బ్యాంకు అకౌంట్ లో జీరో బాలన్స్ కు వచ్చే స్థితికి వచ్చాడు. పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కల్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్మెందుకు సిద్ధం అయ్యాడట. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేసినట్లు తెలుస్తుంది. ఈ స్థలాన్ని ఓ పారిశ్రామికవేత్త కొనుగోలు చేసాడట. ఇదే తరహాలో మరికొన్ని స్థలాలను అమ్మడానికి పవన్ బేరాలు మొదలుపెట్టారట.

దీంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అమ్ముదాం అనుకుంటున్నా ఆస్తులను చిరంజీవి కొనుగోలు చేసి..ఆ తర్వాత తమ్ముడికి ఇవ్వాలని భావించారట. రాజకీయాల కోసం ఉన్న ఆస్థి అమ్మితే రేపు పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అని చిరంజీవి ఈ ఆలోచన చేసాడట. కానీ దీనికి పవన్ ఒప్పుకోకపోయేసరికి..చిరంజీవి నా మీద ఒట్టు అన్నట్లు మాట తీసుకోవడం తో పవన్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి పవన్ తీసుకుంటున్న తొందర పాటు నిర్ణయాల వల్ల ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడతాడో అని చెప్పి మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం చాల గొప్పదని అంత అంటున్నారు. ఇప్పటికే పార్టీ కోసం పవన్ ఉన్న డబ్బులన్నీ పెట్టాడు..ఇప్పుడు ఆస్తులు కూడా అమ్మితే ఎలా అని సన్నిహితులు కూడా వాపోయారట. కానీ పవన్ వెనుకడుగు వెయ్యను అన్నట్లు ఉన్నాడట.

Read Also : Prashanth Neel: నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు…. కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?