Site icon HashtagU Telugu

Vote For Glass : నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించండి – చిరంజీవి

Chiru Pawan Pithapuram

Chiru Pawan Pithapuram

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య దిగొచ్చాడు..పిఠాపురం (Pithapuram) ప్రజలు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను గెలిపించాలని స్వయంగా కోరారు. ఏపీలో మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫై రాష్ట్రం లోనే దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో గెలుపు ఎవరిదీ అని అంత మాట్లాడుకుంటున్నారు. వైసీపీ నుండి వంగా గీత బరిలోకి దిగితే..కూటమి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందిన పవన్ కళ్యాణ్..ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. దాదాపు 80 % కాపు సామాజికవర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ఇప్పటికే అంత ఫిక్స్ అయ్యారు. అనేక సర్వేలు సైతం లక్ష్యం మెజార్టీ తో పవన్ కళ్యాణ్ గెలుపొందుతున్నారని చెపుతున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటాం..అసెంబ్లీకి పంపిస్తాం అని అభిమానులు , జనసేన శ్రేణులు చెపుతున్నారు. అయినప్పటికీ తమ వంతుగా మెగా ఫ్యామిలీ (Mega Family) , పవన్ కళ్యాణ్ ను అభిమానించే నటి నటులు తమ వంతుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు. ప్రతి ఇంటిగడపకు వెళ్లి గాజు గ్లాస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. హైపర్ ఆది , గెటప్ శ్రీను , సుడిగాలి సుధీర్ లతో పాటు పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు , బుల్లితెర నటి నటులు ప్రచారం చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ , సాయి తేజ్ , వైష్ణవ్ తేజ్ లు ప్రచారం చేయగా..ఇక ఇప్పుడు అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే కూటమికి తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించిన చిరంజీవి (Chiranjeevi )..ఈరోజు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

“కొణిదెల పవన్ కల్యాణ్. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలని మేలు జరగాలని విషయంలో ముందువాడుగానే ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల దగ్గర ప్రాణాలు ఒడ్డి పోరాడే జవానుల కోసం పెద్ద మొత్తంలో ఇవ్వడం, అలాగే మత్స్యాకారులు ఇలా ఎందరికో తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది.

ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఓ మాట చెప్పాను. ఎంతో మంది తల్లుల కోసం వారి బిడ్డల భవిష్యత్‌ కోసం చేసే యుద్ధం అని నా తల్లికి చెప్పాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వారి వల్ల ప్రజాస్వామానికి మరింత నష్టం అని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే… చట్టసభల్లో అతని గొంతును మనం వినాలి.

జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలి అంటే మీరు పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ గెలిపించాలి. మీకు సేవకుడిగా ,సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకు ఏమైనా సరే కాపాడతాడు. మీ కలలను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి. ” అని తన వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో చిరంజీవి పోస్టు చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిరు సందేశం తో కూటమి శ్రేణుల్లో , అభిమానుల్లో ఉత్సహం రెట్టింపు అవుతుంది. ఇక పిఠాపురం ప్రజల్లో కొత్త వెలుగు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Kedarnath Dham : ఈనెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌