Chintamaneni Prabhakar: సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ..

Chintamaneni Prabhakar: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఇటీవల దెందులూరులో జరిగిన సంఘటనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకా, వైసీపీ నేతలపై అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని కోరారు.

Published By: HashtagU Telugu Desk
Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఇటీవల దెందులూరులో జరిగిన సంఘటనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు చింతమనేని. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఇవాళ వంశీ లోనికి వెళ్లాడు, రేపు కొడాలి నాని వెళ్తాడు, ఎల్లుండి మరో నేత వెళ్తాడు” అని పేర్కొన్నారు. గన్నవరం తర్వాత గుడివాడ, భీమవరం వంటి అనేక నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయని, ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. తప్పు చేసిన వారిని చట్టం ఎలాగైనా పట్టుకుంటుందని, వారు తప్పించుకోలేరని ఆయన నొక్కి చెప్పారు. వంశీ ఏ తప్పూ చేయకుండానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ధ్వంసమైందా అని ప్రశ్నించారు చింతమనేని.

Talasani Srinivas Yadav : ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌కు తలసాని శ్రీనివాస్‌ సవాల్

ఇంకా, అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యమని ఆరోపించారు చింతమనేని. “పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా?” అని ప్రశ్నించారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్వేర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి ఎందుకు వత్తాసు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. తన పొలంలో తాను వ్యవసాయం చేయలేని పరిస్థితికి ఎందుకు దిగజారారు అని అబ్బయ్య చౌదరి సమాధానం చెప్పగలరా అని ఆయన అడిగారు. దెందులూరు ఘర్షణలో తన తప్పు రుజువైతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చింతమనేని పేర్కొన్నారు.

“నా గురించి గంటా అరగంటా అంటూ మాట్లాడే అంబటి సర్టిఫికెట్ ఇస్తాడా?” అని ప్రశ్నించారు చింతమనేని. సుకన్య, సంజనల సర్టిఫికేట్ పొందిన అంబటి స్థాయి అందరికీ తెలుసని, ఇక ఈ రకమైన అసభ్య ప్రవర్తన మానుకోవాలని సూచించారు. ఇలా రంకెలు వేస్తే ప్రజలు కాల్చి పెట్టిన వాతలు చూపించుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని ఆయన మండిపడ్డారు. అబ్బయ్య చౌదరి ఉద్దేశపూర్వకంగా తనతో గొడవ పెట్టుకోవాలని పన్నిన ట్రాప్‌లో తను పడలేదని, పోలవరం కాల్వ బాధితులకు చెల్లించాల్సిన 6 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే కుట్రలో భాగంగానే తనతో గొడవ పెట్టుకున్నారని చింతమనేని ఆరోపించారు.

Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై అట్రాసిటీ కేసు

  Last Updated: 14 Feb 2025, 06:08 PM IST