Chintamani: ‘చింతామణి’ వెనుక చాలా ఉంది..!

ఈసారి 'ఒక్క ఛాన్స్ 'అనే నినాదం పనిచేయదని క్రొత్త నినాదాన్ని బైటకు తీయాలని పీకే టీం భావిస్తోంది. 'మళ్లీ జగన్' అనే స్లోగన్ వినిపించాలని ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఆ క్రమంలోనే చింతామణి నాటక నిషేధం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసిందట.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 08:22 PM IST

ఈసారి ‘ఒక్క ఛాన్స్ ‘అనే నినాదం పనిచేయదని క్రొత్త నినాదాన్ని బైటకు తీయాలని పీకే టీం భావిస్తోంది. ‘మళ్లీ జగన్’ అనే స్లోగన్ వినిపించాలని ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఆ క్రమంలోనే చింతామణి నాటక నిషేధం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసిందట. కుల, మత సమీకరణాలతో ఈసారి గెలిపించాలని పీకే పెద్ద ప్లాన్ చేసాడని తెలుస్తోంది. ఇప్పుడు ఆయా వర్గాల్లో మార్పు వచ్చిన విషయం PK టీం కనిపెట్టి ప్రత్యామ్నాయ మార్గాలను బయటకు తీయాలని భావిస్తుందని టాక్. కింది వర్గాల్లో తగ్గిన ఓటును ఉన్నత వర్గాల్లో భర్తీకి శ్రీకారం చుట్టాలని సూచిస్తుందట. ముఖ్యంగా వై. సి. పి మీద వ్యతిరేకతతో ఉన్న వర్గాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసారట. అందుకే ముందుగా బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకునేందుకు పీఠాధిపతులు , మఠాధిపతుల వెంట తిరుగుతూ బి.జె.పి ప్రాపకం పొందాలని చూస్తున్నారు. దానిలో భాగంగా పూజారులకు నెల నెలా జీతం అనే విధానాన్ని బైటకు తీసి సందట్లో సడేమియాగా క్రిస్టియన్ పాస్టర్లకు , ముస్లిం మోజం లకు కూడా జీతాలు ఇచ్చుకుని ఓటు బ్యాంక్ ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది.

క్రిష్టియన్ , ముస్లిం సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. హిందూ దేవా లయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కనుక బ్రాహ్మణు లకు గౌరవ వేతనం ఇవ్వడం లో అర్ధం ఉంది. క్రిష్టియన్, ముస్లిం సంస్థలకు ఎలా ఇస్తారు ? దీన్ని ఏ పార్టీ గానీ, మేధావి గానీ, జర్నలిజమ్ మేధావి గానీ , పత్రికలు గానీ ప్రశ్నించడం లేదు . అంటే ఈ విధానాన్ని ఆమోదించి నట్లే అవుతుంది కదా ? అదే విధంగా ఆర్ధికంగా బలమైన స్థితిలో ఉన్న వైశ్యులు కూడా ప్రశ్నించడం లేదు. కాపులు సంగతి కి వస్తే ఇప్పుడు మరలా కొత్తగా కాపు, కమ్మ మద్య కులాల చిచ్చు పెట్టడానికి తయారుగా ఉన్నారు కొందరు. కాపుల్లో పేరున్న నాయకుణ్ణి అంతం చేసి ఆ నెపం టి. డి. పి పై వేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక టి.డి. పి కి ఓటు బ్యాంకు గా ఉన్న బీసీలను బలంగా తమ వైపుకు తిప్పు కోవాలనే చేయని ప్రయత్నం లేదు.

దానిలో కొంత పురోగతి ఉన్నా అనుకున్నంత మేర లభించడం లేదు. ఎస్సీల భాద్యతను పూర్తిగా క్రిస్టియన్ సంస్థలు నెత్తిన ఎత్తు కున్నాయని సర్వత్రా వినిపిస్తుంది. పాస్టర్లు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం అందుకుంటూ అందుకు కృతజ్ఞతగా గ్రామాల్లో చర్చ్ లను నిర్మిస్తూ వై. సి. పి కి ప్రచారం చేస్తున్నారు. వై. సి. పి కి ఓటు బ్యాంకుగా ఎస్సీలు మారిపోయారని చెప్పక తప్పదని పరిస్థితికి వచ్చింది .
తెలుగుదేశం పార్టీ కన్నా చాలా చాలా ముందు నుండే కమ్మ జాతి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ లోనూ కమ్మ వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు కాపు, బి. సి కులాలతో పాటు వైశ్యులు , బ్రాహ్మణులు తమ వైపుకు వస్తున్నారని పీకే టీం మైండ్ గేమ్ ఆడుతుంది. బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూపంలోనూ, మత పెద్దలు వల్లనూ ఎన్నికల సమయానికి పూర్తిగా వై. సి. పి వైపు మరలుతారని పీకే టీం అంచనా వేస్తోంది. వైశ్యుల ఓట్లను కూడా బ్రహ్మణులే ప్రభావితం చేస్తారని లెక్కిస్తోంది.
కొత్తగా చింతామణి నాటక నిషేదం కూడా ఎన్నికల ఎజండాలో భాగమంటూ విపక్షాల భావన. ముస్లిం, యస్. సి, యస్. టి లు , రెడ్లు ఎలాగూ సొంత ఓటు బ్యాంకుగా వై . సి. పి జమ కడుతుంది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం నడిపే పీకే మైండ్ గేం అని కమ్మ సామాజిక వర్గం గుర్తించ లేకపోతుంది. ఆ వర్గంలోని కొందరు పెయిడ్ ఆర్టిస్ట్ లు కమ్మ జాతి ఎక్కడి నుండీ వచ్చిందీ లేక పుట్టిందీ అన్న విషయం దగ్గర నుంచి నేడు కమ్మ జాతి ఎలా దిగజారి పోయిందో అన్నంత వరకూ రక రకాల కధనాలు వండి వారుస్తున్నారు. కమ్మ సంఘాల నేతలు అనేకులు టీఆర్ఎస్, వైసీపీ కి అమ్ముడు పోయారు. ఇలాంటి కోవర్ట్ వ్యవ హారాలను టీడీపీ అధిష్టానం పసిగట్టలేక పోతుంది. కొందరు బూటకపు కమ్మ సంఘాల పేర రాజకీయ లబ్ది పొందేందుకు ఇతర పార్టీల వారితో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. ఇలాంటి నాయకుల మాటలను నమ్మి కమ్మ సామాజిక వర్గం తెలంగాణలో రాజ్యాధికారాన్ని కోల్పోయింది.

టీఆర్ఎస్ వేసే పదవులను ఎరుకోవడానికి ఆ కులాన్ని తాకట్టు పెడుతున్న కొందరు మీడియా పెద్దలు, రాజకీయ నాయకులను ముందుగా గుర్తించాలి. లేదంటే పీకే టీం తయారు చేసిన స్కెచ్ విజయవంతం కావడం తధ్యం. ఫలితంగా ఏపీలో కూడా రాజ్యాధికారం దూరం అవుతుంది. స్వలాభం కోసం కొందరు ఆడుతున్న గేమ్ లో కమ్మ సామాజిక వర్గ పేదలు, మధ్యతరగతి యువత ఉపాధి కోల్పోతుంది. వాస్తవాలను గమనించి పీకే టీం ఆడుతున్న గేమ్ ను దమ్ముంటే అడ్డుకోవాలి. లేదా సామాజిక అన్యాయం చేసేలా కోవర్ట్ వ్యవహారం చేసి నాలుగు డబ్బులు తీసుకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారు. కోవర్ట్ లతో పీకే టీం గేమ్ ఆడిస్తూ ఏపీ రాజకీయాన్ని కుల, మత ఈక్వేషన్ రూపంలో చూస్తుంది. అందుకే మళ్ళీ జగన్ స్లోగన్ వేగంగా ప్రజల్లోకి వెళ్తుంది. రాబోవు రోజుల్లో వైసీపీకి అనుకూలంగా వుండే ఎల్లో మీడియాలో కోవర్ట్ ల ద్వారా పీకే ప్లాన్ ను విజయవంతం చేయాలని భారీ స్కెచ్ రెడి అయ్యిందట. అదే జరిగితే ‘మళ్ళీ జగన్’ నినాదం గెలవటం తధ్యం.