Site icon HashtagU Telugu

Chereddy Manjula: ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా చేరెడ్డి మంజుల‌.. వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడి చేసిన బెద‌ర‌ని టీడీపీ ఏజెంట్‌..!

Chereddy Manjula

Chereddy Manjula

Chereddy Manjula: ఏపీలో ఎన్నిక‌ల వేళ పోలింగ్ కంటే ర‌క్త‌పాత‌మైన ఘ‌ట‌న‌లే ఎక్కువ వార్త‌ల్లో నిలిచాయి. అయితే టీడీపీ ఏజెంట్ల‌పై వైసీపీ నేత‌లు క‌త్తుల‌తో, క‌ర్ర‌ల‌తో దాడులు చేసిన ఘ‌ట‌నలు మ‌నం చూశాం కూడా. అయితే ప‌ల్నాడు జిల్లాలో వైసీపీ నేత‌ల ఆగ‌డాలు ఓ మ‌హిళపై చూపారు. ఆమె టీడీపీ ఏజెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటే ఆమెపై దాడి చేసి ప్రాణం తీసేంత ప‌నిచేశారు. అయినస‌రే ఆ మ‌హిళ వైసీపీ ఏజెంట్‌ల‌కు ఎదురు నిలిచి త‌న క‌ర్త‌వ్యం తాను చేసి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో ఓ పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా విధులు నిర్వ‌హిస్తున్న చేరెడ్డి ముంజుల‌ (Chereddy Manjula)పై వైసీపీ మూక‌లు వేట‌కొడ‌వళ్ల‌తో దాడి చేసి ఆమె నుదుటిపై గాయం చేశారు. అయితే ఆ దాడికి భ‌య‌ప‌డ‌ని మంజుల నుదుటిపై గాయంతో ర‌క్తం కారుతున్న పోలింగ్ బూత్‌లోనే కూర్చుని త‌న ప‌నిని నిర్వ‌హించారు.

అయితే దాడికి గురైన మ‌హిళ ఎవ‌రో కాదు.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ‌ర‌స‌కు మ‌ర‌దలు. ఆమె మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని రెంట‌చింత‌ల మండ‌లంలోని రెంటాల గ్రామానికి చెందింది. ఆమె భ‌ర్త పేరు వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి. ఆయ‌న కూడా రాజ‌కీయాల్లోనే ఉన్నారు. అయితే మంజుల ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలోనే క్రీయాశీల‌కంగా ప‌నిచేశారు. అయితే వైసీపీ సిద్ధాంతాలు, ఎమ్మెల్యే దౌర్జ‌న్యాలు న‌చ్చ‌ని మంజుల ఈ ఏడాది మార్చి 15న ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. అప్ప‌టినుంచి ఆమె మాచ‌ర్ల టీడీపీ అభ్య‌ర్థిగా ఎంపికైన జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డి గెలుపు కోసం నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం చేశారు.

Also Read: Chandrababu : కొల్లాపూర్‌ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించున్న చంద్రబాబు

అయితే ఎన్నిక‌ల రోజు ఇది మ‌న‌సులో పెట్టుకున్న వైసీపీ మూక‌లు మంజుల దంపతుల‌పై వేట‌కొడ‌వ‌ళ్లుతో దాడికి తెగ‌బ‌డ్డారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన మంజుల భ‌ర్త వెంక‌టేశ్వ‌ర్ రెడ్డిని స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు టీడీపీ నాయ‌కులు. మంజుల మాత్రం నుదుటిపై గాయంతో ర‌క్తం కారుతున్న ప‌ట్టించుకోకుండా బూత్‌లోనే త‌న ప‌నిని నిర్వ‌హించింది. కొంద‌రు టీడీపీ నేత‌లు ఆమెను బ‌ల‌వంతంగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లి గాయానికి చికిత్స చేయించారు. అయితే మంజుల చూపిన ఈ ధైర్యానికి టీడీపీ నేత‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌స్తుతం మంజుల త‌న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మంజుల ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

We’re now on WhatsApp : Click to Join

దాడిని ఖండించిన చంద్ర‌బాబు

సోమ‌వారం పోలింగ్ లో హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేకుండా… ప్రణాళికాబద్దంగా వైసీపీ తన కుట్రలు అమలు చేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందించకపోవడం సరికాదు. మాచర్లలో శాంతి భద్రతలను కాపాడి…ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వెంటనే దృష్టిపెట్టాలి అని ఎన్నిక‌ల రోజు ట్వీట్ చేశారు.