గత కొన్నాళ్లుగా తమిళనాడు(Tamilanadu), కర్ణాటక(Karnataka)లో పాల వివాదం నడిచిన సంగతి తెలిసిందే. గుజరాత్(Gujarath) కి చెందిన అమూల్(Amul) కంపెనీ పాలను విమర్శిస్తూ, వాటి నిర్ణయాలను విమర్శిస్తూ పాల రాజకీయం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అమూల్ కు పాలను అమ్మొద్దని గతంలో ప్రకటించాయి. ఇక కర్ణాటక ఎలక్షన్స్ టైంలో అయితే అమూల్ వర్సెస్ కర్ణాటక పాల కంపెనీ నందిని(Nandini) పెద్ద రచ్చే జరిగింది.
కానీ ఏపీ(AP)లో మాత్రం ముందు నుంచి అమూల్ పాలకు సహకరిస్తూనే వచ్చారు. స్వయంగా ప్రభుత్వం అమూల్ కంపెనీ పాలను సేకరించడానికి అనుమతి ఇచ్చింది. తాజాగా ఏపీ పాల కంపెనీ విజయతో పాటు కలిపే అమూల్ ని అమ్ముతున్నారని, విజయ(Vijaya)కు నష్టం చేకూరుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
దీనిపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. విజయ డెయిరీ స్టాల్స్ లో అమూల్ పాలు అమ్మడం లాభమే. విజయ డెయిరీలో అమూల్ పాలు అమ్ముతున్నారని అంటున్నారు. విజయ డెయిరీ ప్రభుత్వానిది. విజయ డెయిరీలో అమూల్ పాలు అమ్మితే మంచిదే. విజయ డెయిరీలో అమూల్ పాల సేకరణ చేస్తే తప్పేంటీ? అమూల్ ను మనం స్వాగతించాం అని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి వేణుగోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.