Chelluboina Venu : పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగన్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) తెలిపారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందని, పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగనేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మేనిఫెస్టో 100శాతం అమలు చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే టీడీపీ వాకౌట్ చేసిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. టీడీపీకి గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని […]

Published By: HashtagU Telugu Desk
Chelluboina Venu

Chelluboina Venu

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) తెలిపారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందని, పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగనేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మేనిఫెస్టో 100శాతం అమలు చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే టీడీపీ వాకౌట్ చేసిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. టీడీపీకి గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని మంత్రి జోస్యం చెప్పారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer) ప్రసంగంలో విద్య, వైద్యం గురించి ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ లో ఆయన మాట్లాడుతూ… గతంలో రాజకీయ నాయకులమీద నమ్మకం ఉండేది కాదని… ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

అన్నివర్గాల సంక్షేమానికి అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచిచేస్తేనే తనకు ఓటు వేయాలని జగన్ అన్నారంటే.. ప్రజలపై ఆయనకు ఎంత చిత్తశుద్ది ఉందో తెలుస్తుందని అన్నారు. పేదవారికి మంచి చేసే వారిని ఓడిస్తానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ కనబడదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పేదరికం తగ్గిందని చెప్పారు. కొంత మంది నేతలు ధనదాహానికి అసత్యాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చి నాటికి ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం జగన్. ఎన్నికలకు సన్నద్ధం కావడటమంటే, పార్టీ శ్రేణులంతా గ్రామ స్థాయి నుంచి ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ప్రజలతోనే మన పొత్తు అని చెప్పారు. రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతోందని. పేదవారంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

Read Also : Kumari Aunty : నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా కుమారి ఆంటీ స్టోరీ..!

  Last Updated: 05 Feb 2024, 06:31 PM IST