అధికార పార్టీ వైసీపీ వరుస ఎదురుదెబ్బలు తగ్గడం లేదు. వరుసపెట్టిన మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు మాత్రమే కాదు కింద స్థాయి నేతలు కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా…తాజాగా నెల్లూరు లో మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. ఇటీవలే వైసీపీని వీడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనే తన ప్రయాణమని చేజర్ల సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన చేజర్ల సుబ్బారెడ్డి ఎంపీపీగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. జిల్లాలో వైసీపీకి విధేయుడిగా గుర్తింపు పొందారు. టీడీపీకి దగ్గరైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. మేకపాటి… వైసీపీ అధిష్ఠానంపై విమర్శలు చేసినప్పుడల్లా చేజర్ల సుబ్బారెడ్డి వాటిని తిప్పికొడుతూ వార్తల్లో హైలైట్ అయ్యేవారు. ఇప్పుడు ఆయనే వైసీపీని వీడడం జిల్లా పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేస్తుంది. మరి ఈయన రాజీనామా వెనుక అసలు కారణాలు ఏంటి అనేవి తెలియాల్సి ఉంది.
Read Also : 5th Test Squad: చివరి టెస్టులో బుమ్రా ఎంట్రీ, రాహుల్ ఔట్