Check your Vote : ఎన్నిక‌ల ముందు ఓట్ల గోల్ మాల్

`చెక్ యువ‌ర్ ఓట్ `  (Check your Vote )అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ట్వీట్ చేయ‌డం ఏపీ రాష్ట్రంలో జ‌రుగుతోన్న ప‌రిణామానికి నిద‌ర్శ‌నం.

  • Written By:
  • Updated On - July 17, 2023 / 03:25 PM IST

`చెక్ యువ‌ర్ ఓట్ `  (Check your Vote )అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ట్వీట్ చేయ‌డం ఏపీ రాష్ట్రంలో జ‌రుగుతోన్న ప‌రిణామానికి నిద‌ర్శ‌నం. ఆ పార్టీకి కూడా ఇదో ఛాలెంజ్ టైం. ఓట‌ర్ల జాబితాలోని టీడీపీ ఓట్ల‌ను పెద్ద ఎత్తున వైసీపీ తొల‌గిస్తోంది. ఆ విష‌యాన్ని టీడీపీ లీడ‌ర్లు ప‌య్యావుల కేశ‌వ్, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు నిరూపించారు. వాళ్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో తొలగించిన వేల ఓట్ల వివ‌రాల‌ను కూడా ఎన్నిక‌ల క‌మిష‌న్ కు తెలియ‌చేశారు. రాబోవు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొల‌గింపు దందా సాగుతుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఢిల్లీ వ‌ర‌కు ఓట్ల తొల‌గింపుపై పోరాడతానంటూ ఇటీవ‌ల చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు.

చెక్ యువ‌ర్ ఓట్ `  అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ట్వీట్(Check your Vote )

ప్ర‌స్తుతం వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ సేవ‌ల‌తో పాటు కుటుంబాల మీద నిఘాను పెంచింది. ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఒక వ‌లంటీర్ గ‌త నాలుగేళ్లుగా ప‌నిచేస్తున్నారు. అద‌నంగా గృహ‌సార‌థుల‌ను ప్ర‌తి 50 మంది ఓట‌ర్ల‌కు ఒక‌ర్ని వైసీపీ నియ‌మించింది. వాళ్ల‌తో ఎమ్మెల్మేలు ఇటీవ‌ల మీటింగ్ పెట్టారు. తెలుగుదేశం సానుభూతిప‌రులు, క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను తొల‌గించాల‌ని మౌఖిక ఆదేశం వ‌లంటీర్లు, గృహ‌సార‌థుల‌కు ఇచ్చిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. వైసీపీ సానుభూతిప‌రులుగా ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను కూడా తొల‌గించాల‌ని (Check your Vote )  సందేశం తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వ‌చ్చింద‌ని వినికిడి. అందుకు నిద‌ర్శ‌నంగా ఏపీలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో 10వేల నుంచి 20వేల ఓట్లు కొన్ని చోట్ల తొల‌గించిన‌ట్టు ఈసీ కి టీడీపీ ఫిర్యాదు చేసింది.

తెలుగుదేశం సానుభూతిప‌రులు, క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను తొల‌గించాల‌ని

ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ ఓట‌ర్ల జాబితాను చెక్ చెసుకోవ‌డం ప్ర‌ధాన విధిగా రాజ‌కీయ పార్టీల‌కు మారింది. పైగా డేటా మొత్తం అధికార పార్టీ చేతిలో ఉంది. ఎవ‌రు ఏ పార్టీ వైపు ఉన్నారు? అనేది క్లియ‌ర్ గా వ‌లంటీర్ స‌మాచారం ఇవ్వ‌డానికి ఏ మాత్రం అడ్డులేదు. ఇక గృహ‌సార‌థులు సీన్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ద్వారా డైరెక్ట్ ఫైట్ విప‌క్షాల‌తో చేస్తున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల మేర‌కు వ‌లంటీర్లు దూరంగా ఉంటున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ గృహ సార‌థుల ద్వారా అన్ని ర‌కాలు అరాచ‌కాల‌కు నాంది ప‌లుకుతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ప్ర‌ధానంగా ఓట‌ర్ల జాబితా నుంచి టీడీపీ ఓట‌ర్ల‌ను  (Check your Vote )తొల‌గించ‌డాన్ని ఈసీ కూడా సీరియ‌స్ గా తీసుకుంది. అంతేకాదు, ఒక్కో ఇంటిలో వంద‌ల ఓట్ల‌ను చేర్చుకున్న వైసీపీ వాల‌కం కూడా బ‌య‌ట‌ప‌డింది.

రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం `చెక్ యువ‌ర్ ఓట్`

అధికార పార్టీ ఓట్ల జాబితాల విష‌యంలో చేస్తోన్న కుయుక్తుల‌ను టీడీపీ ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు తీస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రి ఓటు వాళ్లు నిరంతరం చెక్ చేసుకోవాల‌ని చంద్ర‌బాబు తాజాగా ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు.
`ఓటు మన బాధ్యత అని, ఓటుతోనే భద్రత అని, ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా అని చంద్రబాబు తెలిపారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల ప్ర‌కారం ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటర్ వెరిఫికేషన్  (Check your Vote )చేపడతారు. ఆ సందర్భంగా ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోవ‌డం పౌరుల విధి. ఓటు లేకపోతే వెంటనే ఓటరుగా మీ పేరును నమోదు చేసుకోవ‌చ్చు.

Also Read : TDP Jumping Leaders : అమ‌రావ‌తి నేత‌ల పోటు!?

ఎన్నిక‌ల రోజున జాబితాలో పేరు లేకుండా ఓటు వేయ‌లేం. ఆధార్ కూడా అనుసంధానం జ‌రుగుతోంది. బ‌తుకుతెరువు కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన ఓట్ల‌ను తొల‌గిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిప‌రులు ఎక్కువ‌గా ఇత‌ర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఐటీ తో పాటు ఇత‌ర‌త్రా రంగాల్లో ప‌నిచేయ‌డానికి హైద‌రాబాద్, బెంగుళూరు వంటి న‌గ‌రాలుకు పెద్ద ఎత్తున వెళ్లారు. సుమారు 10ల‌క్ష‌ల ఓట్ల వ‌ర‌కు వ‌ల‌స వెళ్లిన వాళ్ల‌వి ఉన్నాయ‌ని ఒక అంచ‌నా. ఆ ఓట‌ర్ల‌తో ఎక్కువ భాగం టీడీపీ సానుభూతిప‌రులని వ‌లంటీర్లు గుర్తించార‌ట‌. వాళ్ల‌తో పాటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గంకు చెందిన యువ‌త ఓట్ల‌ను టార్గెట్ గా చేసుకుని తొల‌గింపు ప్రక్రియ‌ను వైసీపీ చేస్తోంద‌ని విప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌. అందుకే, అధికారంలోకి రావాలంటే ఓట‌ర్ల జాబితాలో ఓట్ల‌ను కాపాడుకోవ‌డం టీడీపికి పెద్ద స‌వాల్ గా మారింది. పౌరులంద‌ర్నీ చంద్ర‌బాబు అప్ర‌మ‌త్తం చేస్తూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలియ‌చేస్తున్నారు. ఓటు విలువ‌ను గుర్తు చేస్తూ రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం `చెక్ యువ‌ర్ ఓట్` అంటూ నిన‌దించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : TDP Scheme : మ‌గువ‌కు `మ‌హాశ‌క్తి` చంద్ర‌బాబు