సీఎం చంద్రబాబు (Chandrababu) రాష్ట్ర రైతులకు కీలక సూచనా తెలియజేసారు. గత ప్రభుత్వం ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) తెచ్చిందని ..దీని వల్ల రాష్ట్ర ప్రజలందరూ తమ భూములను ఒకసారి చెక్ చేసుకోవాలి అని కోరారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి వెంటనే ఫిర్యాదు చేయాలి అని సూచించారు. అలాగే గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం సహజవనరులు దోపిడీ చేసిందని , అడవులను కూడా ధ్వంసం చేసిందని ఆరోపించారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపద దోపిడీ జరిగిందని, వైసీపీ ప్రభుత్వం కొత్త విధానంతో దోపిడీ జరిగిందని విమర్శలు చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలు చేశారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు దందాలకు దిగారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘9 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు రేప్ చేసి, చంపేయడమేంటి..? 6 నెలల శిశువుపై లైంగిక దాడి చేయడమేంటి..? సమాజం ఎటు పోతోంది..? కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు. గంజాయి, మద్యం మత్తులో నేరాలు చేసే వారిని వదలను. చెడు అలవాట్లు ఉంటే మానుకోండి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇదే నా హెచ్చరిక’ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) జీవో, గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఇప్పుడెందుకు బయటపెట్టారో విచారించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. కాగా GPS అమలు చేస్తూ జూన్ 12న గెజిట్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
Read Also : BYD Atto 3 Electric : తక్కువ ధరలో ఒక విలాసవంతమైన ఈ-కార్..!