Check for Jagan and Modi : జైలు నుంచి చంద్రబాబు చక్రం తిప్పారు. జనసేనాని 40 నిమిషాల పాటు ములాఖత్ రాష్ట్ర భవిష్యత్ కు బాట వేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కెచ్ గీశారు. రాబోవు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి అడుగు పడింది. బీజేపీ ఢిల్లీ పెద్దలతో సంబంధం లేకుండా పొత్తును ప్రకటించేశారు పవన్. ఖచ్చితంగా టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళతాయని పవన్ తేల్చారు. దీంతో బీజేపీ అడుగులు ఏమిటి? అనేది పెద్ద ప్రశ్న.
`కత్తి`తీసిన చంద్రబాబు, జైలు నుంచే కదనరంగంలోకి..(Check for Jagan and Modi)
ఏడాది కాలంగా దోబూచులాడుతూ వచ్చిన టీడీపీ, జనసేన పొత్తుకు స్పష్టత వచ్చింది. యాదృశ్చికంగా వచ్చిన సందర్భాన్ని చంద్రబాబు అనుకూలంగా మలుచుకున్నారు. సమయం చూసి జైలు నుంచి బీజేపీ మీద చంద్రబాబు కసి తీర్చుకున్నారు. ఆ పార్టీతో కలిసి వెళ్లడానికి వాస్తవంగా టీడీపీకి ఇష్టం లేదు. అలాగని, జనసేన లేకుండా ఎన్నికలకు వెళ్లడానికి ఆలోచించింది. ఇప్పుడు సందర్భం, సమయం కలిసి వచ్చింది. బీజేపీని కాదని పవన్ పొత్తును ప్రకటించారు. పొత్తు బాల్ ను బీజేపీ కోర్టులో వేశారు. ఇక దాన్ని మోడీ, అమిత్ షా తేల్చుకోవాలి.
వై నాట్ పులివెందుల దిశగా..
వాస్తవంగా బీజేపీతో పొత్తు లేకుండా వెళితే తిరుగులేకుండా టీడీపీ, జనసేనకు 160 సీట్లు వస్తాయని తాజా సర్వేల సారాంశం. కేవలం టీడీపీ వరకు మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళితే, 130 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని జాతీయ మీడియా సర్వేలు చెబుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును పంపిన తరువాత ఏపీలోని రాజకీయం మారిపోయింది. సానుభూతి వెల్లువలా టీడీపీకి సమకూరింది. అందుకే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 130 స్థానాలకు పైగా టీడీపీకి వస్తాయని సర్వేలు తేల్చాయి.అదే, జనసేన కూడా కలిస్తే, కేవలం 10 నుంచి 15 స్థానాలకు వైసీపీ పరిమితం అవుతుందని సర్వే సంస్థలు కోడైకూస్తున్నాయి. ఇప్పుడు అదే జరిగింది. జనసేనాని పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబును కలిసి వచ్చిన తరువాత పొత్తును ప్రకటించేశారు.
బీజేపీని వదిలించుకుని పవన్ కలిసి వెళ్లడానికి
సుదీర్ఘ రాజకీయ అనుభవం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు ప్రయోగించారు. వ్యూహాత్మకంగా బీజేపీకి పవన్ ను దూరం చేయగలిగారు. వస్తే రండి, లేదంటే లేదనే ధోరణిలో బీజేపీ గురించి పవన్ మాట్లాడారు. అంటే, పొత్తు దిశగా బీజేపీ రాకపోతేనే మంచిదనే ధోరణి కనిపించింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మునిగిపోతామని సర్వేల ద్వారా అందరికీ తెలుసు. అందుకే, ఆ పార్టీ నుంచి పవన్ ను విడదీయడానికి చాలా కాలంగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. ఇప్పుడు కాగలకార్యాన్ని గంధర్వులు తీర్చినట్టు జైలుకు చంద్రబాబునాయుడిని పంపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అటు టీడీపీ ఇటు జనసేన పొత్తును ఖరారు అయ్యేలా ఉపయోగపడ్డారు.
Also Read : TDP- Janasena Alliance : టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్
సాధారణంగా పొత్తులు ఖరారు చేసుకునే సమయంలో పార్టీల అధిపతుల మధ్య సంప్రదింపులు ఉంటాయి. సుదీర్ఘ మంతనాలు సాగుతాయి. కానీ, అవేమీ లేకుండా అకస్మాత్తుగా పొత్తులను పవన్ ప్రకటించేశారు. కేవలం టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించారు. వస్తే, బీజేపీ రావచ్చు లేదా రాకపోవచ్చు అనే ధోరణి ప్రదర్శించారు. అంటే, చంద్రబాబు రెండేళ్లుగా ఏది అనుకుంటుఉన్నారో, దాన్ని సాధించగలిగారు. మరో ఆరు నెలలు లేదా మూడు నెలల్లోనే ఎన్నికలు వస్తున్నాయి. దానికి సంబంధించిన స్కెచ్ ను పక్కాగా చంద్రబాబు వేశారు. జైలు నుంచి చక్రం తిప్పారు. పొత్తు ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయినట్టే.
Also Read : TDP in camera :చంద్రబాబు కుర్చీలో నేడు బాలయ్య! నాడు దేవేందర్ గౌడ్!!
దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి బలపడుతోంది. పైగా ఆ కూటమిలోని జాతీయ నేతలు చంద్రబాబును జైలుకు పంపడాన్ని ఖండిచారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు లాంటి నేత కావాలిన కోరుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలకాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి వెళ్లడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. కానీ, ఆ పార్టీ పెద్దల సహకారంతో జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపారని చంద్రబాబుకు బోధపడింది. అందుకే, రాజకీయ కత్తిని తీశారు. ప్రముఖ న్యాయవాది లూథ్రూ చెప్పినట్టు కత్తితో పోరాటం చేయడం చంద్రబాబుకు ఇక మిగిలింది. అందుకే, ఆయన బీజేపీని వదిలించుకుని పవన్ కలిసి వెళ్లడానికి సిద్దమయ్యారు. అదే విషయాన్ని పవన్ రూపంలో ప్రకటన వెలువడింది. రాబోవు రోజుల్లో ఇండియా కూటమి ద్వారా ఢిల్లీ చక్రం మరోసారి చంద్రబాబు తిప్పడానికి ఛాన్స్ దొరికింది. సంక్షోభంలోనూ అవకాశాలను వెదుక్కోవాలనే సూత్రాన్ని మరోసారి చంద్రబాబు నిరూపించారు. బీజేపీ, వైసీపీ ఏకకాలంలో క్లోజ్ అయ్యేలా చక్రబంధాన్ని జైలు నుంచి తిప్పారు చంద్రబాబు.