వైఎస్ భారతి(YS Bharathi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran ) పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఘటనపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, పోలీసులకూ అప్పగించింది. దీంతో కోర్టు కేసులతో అతడు బిజీగా ఉండిపోయిన నేపథ్యంలో, అతని కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. కిరణ్ తండ్రి యాక్సిడెంట్ తర్వాత మంచానికే పరిమితమవగా, తల్లి పనికెళ్లలేని పరిస్థితిలో ఉంది.
YouTube: యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్లకు అదిరిపోయే న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది..
ఈ పరిస్థితిని గమనించిన టీడీపీకి చెందిన కొంతమంది నేతలు, కార్యకర్తలు కిరణ్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ వారి ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు. కిరణ్ ఆవేశంలో పొరపాటు చేశాడని, అయితే ఆయన కుటుంబం దాని పరిణామాలు అనుభవించడం న్యాయముకాదని చెబుతున్నారు. అందుకే అతని తల్లి బ్యాంక్ ఖాతా వివరాలు షేర్ చేస్తూ విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రయత్నానికి మద్దతుగా టీడీపీ ఎన్నారై విభాగం రూ.1,00,000 విరాళంగా ప్రకటించింది.
ఇలా పార్టీలో నుంచి సస్పెండ్ అయినప్పటికీ, చేబ్రోలు కిరణ్ పట్ల టీడీపీ నేతల్లో మానవతా దృక్పథం కనిపిస్తోంది. ఒక సామాన్య కార్యకర్త కుటుంబం ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ కార్యకర్తలు స్పందించడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రజల సహకారంతో కిరణ్ కుటుంబానికి కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉంది. ఈ సంఘటన పార్టీ పరిధిలో మాత్రమే కాక, సామాజికంగా కూడా చర్చనీయాంశంగా మారింది.