గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రేపు (నవంబర్ 18) కడప(Kadapa) జిల్లాలో సందడి చేయనున్నారు. పెద్ద దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాల్లో(Ursu Festival) పాల్గొననున్నారు. దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు హాజరు కావాలని ఇటీవల నిర్వహకులు ఆయనకు ఆహ్వానం అందించారు. వారి ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని రామ్ చరణ్ హామీ ఇచ్చారు. దీంతో రేపు ఆయన గజల్ ఈవెంట్‌లో సందడి చేయబోతున్నారు. రామ్ చరణ్ రాక సందర్బంగా పోలీసులు , నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడం తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో నటించారు.
కడప ఉర్సు ఉత్సవాల (Urusu Celebrations) విషయానికి వస్తే..
కడప నగరంలో ప్రతి ఏడాది ఉల్లాసంగా జరిగే కార్యక్రమం. కడపలోని చారిత్రాత్మకమైన దర్గా (పట్టు ఉల్లాల్) వదియా వద్ద ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలు సాధారణంగా ఇస్లామిక క్యాలెండర్ ప్రకారం, మౌలానా పట్టు ఉల్లాల్ యొక్క వర్ధంతి రోజు జరుపబడతాయి.
రేపటి నుంచి ఈనెల 21వరకు జరిగే ధాన ఉరుసు ఉత్సవాలకు దర్గా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే విద్యుద్దీప శోభతో ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు సూఫీ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. భక్తులు దర్గాకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్ముతారు. ఇక్కడ ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో రేపు కడపలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా అధికారులు.
Read Also : Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భట్టి