Character Assasination : `వ్య‌క్తిత్వ హ‌న‌న` ఈనాటిది కాదు..!

`వ్య‌క్తిత్వ హ‌న‌న‌`అనేది ఇప్పుడు వినిపిస్తోన్న ప‌దం కాదు. ఎప్ప‌టి నుంచే రాజ‌కీయ నేత‌ల‌నే కాదు..వివిధ రంగాలలోని సెల‌బ్రిటీల‌ను వేధిస్తోన్న ప‌దం అది.

  • Written By:
  • Publish Date - November 20, 2021 / 01:05 PM IST

`వ్య‌క్తిత్వ హ‌న‌న‌`అనేది ఇప్పుడు వినిపిస్తోన్న ప‌దం కాదు. ఎప్ప‌టి నుంచే రాజ‌కీయ నేత‌ల‌నే కాదు..వివిధ రంగాలలోని సెల‌బ్రిటీల‌ను వేధిస్తోన్న ప‌దం అది. తెలుగు రాజ‌కీయాల‌లో రెండు ద‌శాబ్దాలుగా `వ్య‌క్తిత్వ హ‌న‌న` ఎక్కువ‌గా వినిపిస్తోంది. రాగ‌ద్వేషాల‌కు అతీతంగా విశ్లేషిస్తే..తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుతుడ్ని చేసే క్ర‌మంలో ల‌క్ష్మీపార్వ‌తి వ్య‌క్తిత్వంపై ప‌లు ఊహాగానాల‌ను విన్నాం. ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త అంశాల‌పై ప్ర‌ముఖ ప‌త్రిక‌లు కొన్ని చ‌ద‌వ‌లేని రాత‌ల‌ను రాశాయి. అప్ప‌టి వ‌ర‌కు క‌లియుగ పురుషుడుగా ఆయ‌న్ను భావించే వాళ్లు ఆ రాత‌ల‌ను చ‌ద‌వి మ‌ద‌న‌ప‌డ్డారు. ఆ త‌‌రువాత అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన కామెంట్లు రాజ‌కీయ దుమారాన్ని ఆనాడు రేపాయి.

Also Read : NTR Vs CBN : విధిరాత‌.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్ర‌బాబు శ‌ప‌థం

`మీ అమ్మ క‌డుపున ఎందుకు పుట్టానా..` అనుకుంటావ్ అంటూ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అసెంబ్లీలో చంద్ర‌బాబు మీద వ్య‌క్తిత్వ హ‌న‌న చేస్తూ మాట్లాడారు. ఆనాడు త‌న త‌ల్లిని కించ‌ప‌రుస్తూ మాట్లాడార‌ని బాబు ఆవేదన చెందాడు. ఎన్నోసార్లు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అంశాన్ని చంద్ర‌బాబు మీద అసెంబ్లీ బ‌య‌ట‌, లోప‌ల ప్ర‌యోగించారు. ఆయ‌న వ్య‌క్తిత్వం గురించి మాజీ సీఎం రోశ‌య్య‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తో పాటు ప‌లువురు సీనియ‌ర్లు అసెంబ్లీలో ప్ర‌స్తావించిన సంద‌ర్భాలు అనేకం.ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన త‌రువాత మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మీద వ‌చ్చిన గాసిప్స్ చూశాం. ఆయ‌న కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌ధాన మీడియా మెగాస్టార్ కుటుంబం లోప‌ల‌కు తొంగి చూసింది. జ‌న‌సేన పార్టీని పెట్టిన త‌రువాత ప‌వ‌న్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి అనేక మంది ప్ర‌స్తావించారు. ఆయ‌న వివాహేత‌ర సంబంధాల గురించి వైసీపీ, టీడీపీ నేత‌లు ప‌లుమార్లు ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. పూన‌మ్ కౌర్ ను ఏదో చేశాడ‌ని..ఇప్ప‌టికీ పోసాని ముర‌ళీకృష్ణ లాంటి వాళ్లు ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలోకి చొర‌బ‌డ్డారు.

Also Read : భోరున విల‌పించిన చంద్ర‌బాబు

ప్ర‌స్తుత సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్ కుటుంబ స‌భ్యుల జీవితాల‌లోకి అనేక సంద‌ర్భాల్లో ప్ర‌త్య‌ర్థులు వెళ్లారు. కేసీఆర్ ముక్కు, శ‌రీర ఆకృతి గురించి రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు మాట్లాడారు. క‌విత వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప్ర‌త్య‌ర్థులు అనేక సంద‌ర్భాల్లో కామెంట్లను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆ సంద‌ర్భంగా సైబ‌ర్ పోలీసులు కేసులు న‌మోదు చేసి క‌ట్ట‌డీ చేయ‌గ‌లిగారు.ఇక‌ జ‌గ‌న్ కుటుంబం గురించి ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లతో పాటు వాళ్ల సంబంధించిన సోష‌ల్ మీడియా 2019 ఎన్నిక‌ల‌కు ముందు పెట్టిన పోస్ట్ లు అనేకం. ష‌ర్మిల వ్య‌క్తిగ‌తం గురించి ప్ర‌భాస్ ను బ‌జారు కీడ్చారు. ఆ సంద‌ర్భంగా ఆమె కేసు కూడా న‌మోదు చేసింది. స్వ‌ర్గీయ వైఎస్ బ‌తికున్న రోజుల్లో ఆయ‌న మీద జ‌గ‌న్ తుపాకీ గురి పెట్టాడ‌ని, అత‌నో సైకో అని ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లు మీడియా వేదిక‌గా చేసిన కామెంట్లు విన్నాం. జ‌గ‌న్‌ ప్రైవేటు జీవితాన్ని, బాడీ లాగ్వేజ్ , ప్యాలెస్ లో ఆయ‌న చేసే ప‌నులంటూ ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలను రాశారు. సోనియా, జ‌గ‌న్ మైండ్ సెట్ గురించి వారి జీవితాల లోప‌ల‌కు వెళ్లి వ్య‌క్తిగ‌త జీవితాల‌ను విశ్లేషించిన తెలుగు విశ్లేష‌కులు ఉన్నారు. భార‌తి,విజ‌య‌మ్మ , ష‌ర్మిల గురించి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌ర్థులు పెట్టిన పోస్ట్ లు గుర్తుండే ఉంటాయి. ఎమ్మెల్యే రోజా బ్లూ ఫిల్ముల గురించి తెలుగుదేశం ఆనాడు నానా యాగీ చేసింది. ఇప్పుడు చంద్ర‌బాబు కుటుంబం గురించి అసెంబ్లీ వేదిక‌గా వ్య‌క్తిత్వ హ‌న‌న జ‌రిగింది. దీంతో చంద్ర‌బాబు క‌న్నీళ్లు పెట్టుకుని భోరున ఏడ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. జాతీయ స్థాయిలో దీనిపైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే సంద‌ర్భంలో మోడీ స‌తీమ‌ణి గురించి జ‌రిగిన వ్య‌క్తిత్వ హ‌న‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బ‌య‌లు దేరిన వ్య‌క్తిత్వ హ‌న‌న దేశానికి పాకింది. దీనికి ఎలాంటి ఫుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.