Site icon HashtagU Telugu

YSR District: వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్చాలని చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ

Satya Kumar- YSR District

Satya Kumar- YSR District

వైఎస్‌ఆర్‌ కడప: వైఎస్‌ఆర్‌ జిల్లా పేరును మార్చాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ గారు కోరారు. ఈ నేపథ్యంలో, ఆయన సీఎం చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ కడపగా గెజిట్ ద్వారా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరుకోవడానికి తొలి అడుగు కడప అని మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు.

అతని ప్రకారం, కడప జిల్లాకు చారిత్రక నేపథ్యం మరియు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నది, మరియు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్ల పిచ్చితో జిల్లా పేరు వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చడం తప్పు అని ఆయన విమర్శించారు. అందుకే, కడప జిల్లా ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ, జిల్లా పేరును గెజిట్ ద్వారా మార్చాలని, గతంలో జరిగిన తప్పును సరిదిద్దాల్సిందిగా ఆయన కోరారు. ఈ విషయాలను ఆయన లేఖలో వివరించారు.

కడప చరిత్ర:

పూర్వం ఈ ప్రాంతం రాక్షస నిలయంగా ఉంది. ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించేందుకు మత్స్యావతారంలో ఆవిర్భవించినట్లు మంత్రి సత్యకుమార్‌ వివరించారు. కృపాచార్యులు ఒకసారి తీర్థయాత్రల కోసం ఈ ప్రాంతంలో వచ్చి, ఇక్కడ హనుమత్ క్షేత్రంలో బస చేశారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని సంకల్పించారు, కానీ కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్లలేకపోయారు.

శ్రీవారి దర్శనం కోసం కృపాచార్యులు తపించడంతో, ఆ తర్వాత ఆయన శ్రీవారి కృపను పొందారు. నిస్సహాయులు కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళలేకపోతే, తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఈ క్షేత్రంలో కృపాచార్యులు ప్రతిష్టించారు. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహం ముందు ప్రతిష్టించబడిన శ్రీవేంకటేశ్వర స్వామి భక్త వత్సలుడై ఇక్కడ పూజలు పొందుతున్నాడు. నాటి నుంచి, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ముందుగా ఈ స్వామివారిని దర్శించుకోవడం ఒక ఆచారంగా మారింది. కృపాచార్యులు స్వామి వారి కృప పొందిన ప్రదేశం కావడంతో, ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. క్రమంగా, కృపావతి కురపగా, కుడపగా మారి కడపగా ప్రసిద్ధి చెందింది. అలంటి చరిత్ర ఉన్న కడప జిల్లాను గత ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ జిల్లా గా మార్చడాన్ని మంత్రి సత్యకుమార్‌ తన లేఖలో విమర్శించారు.

ఈ పరిణామంపై శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నాయని.. కానీ భయంతో ఎవరూ తమ అభిప్రాయాలను బయటపెట్టలేకపోయారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. సీఎంగా ఉన్న సమయంలో కడప జిల్లా అభివృద్ధికి వైఎస్‌ఆర్‌ చేసిన కృషిని ఎవరూ కాదనలేరని ఆయన పేర్కొన్నారు. అందుకే, కడప జిల్లా చారిత్రక నేపథ్యాన్ని మరియు వైఎస్‌ఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఈ జిల్లాను వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Exit mobile version