Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబు తొలిసంతకంలో మార్పు..?

Babu Sign

Babu Sign

మరికాసేపట్లో ఏపీకి 4 వ సారి సీఎం గా చంద్రబాబు (Chandrababu) ప్రమా స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి (Kesarapalli ) ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మూడు కీలక హామీలపై తొలి సంతకం చేయలేని భావించారు..కానీ ఇప్పుడు సంతకాల్లో మార్పు జరిగినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మోడీ భువనేశ్వర్‌ వెళ్లి ఒడిసా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగాలు ఏవీ ఉండవని తెలుస్తుంది. ప్రధాని ప్రసంగం కూడా ఉండబోదని అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదే ప్రాంగణంలో కొత్త మంత్రులతో అల్పాహార విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రధానిని కూడా ఆహ్వానించారు. ప్రధానికి చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. కార్యక్రమం పూర్తయిన తరువాత ప్రధానికి వీడ్కోలు పలికేందుకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం వెళ్లనున్నారు. ఇక, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మూడు ప్రధాన హామీలకు సంబంధించి ప్రమాణ స్వీకారం వెంటనే సంతకాలు చేయాలని చంద్రబాబు గతంలో నిర్ణయించారు. కానీ, ఇప్పుడు స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు.

బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళతారు. కుటుంబంతో కలిసి తమ ఇష్టదైవం అయిన వెంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోనున్నారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం రాత్రి 9 గంటలకు తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేయనున్నారు. గురువారం ఉదయం 7.30 గంటలకు కుటుంబంతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా తిరుపతి, తిరుమలలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Read Also : Robbin Sharma : రాబిన్ శర్మ.. ఏపీలో టీడీపీ విజయం వెనుక మాస్టర్‌మైండ్