Site icon HashtagU Telugu

AP Pension : పెన్షన్ దారులకు చంద్రన్న మరో తీపి కబురు ..

CM Chandrababu will visit Srisailam on 9th of this month

CM Chandrababu will visit Srisailam on 9th of this month

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు (APCM CHandrababu) వరుస తీపి కబుర్లు అందజేస్తూ..ప్రజలు తమ ప్రభుత్వం ఫై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటిగా నెరవేరుస్తూ..ప్రజలను ఆనంద పరుస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ దారులైతే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

సీఎంగా తన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్‌(ap pension)ల పెంపుపై చర్యలు తీసుకున్నారు. 2024 జూన్ 13న, పెన్షన్ మొత్తాన్ని రూ. 4,000కు పెంచుతూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ పెంపు ఏప్రిల్ నెల నుంచే అమలులోకి వస్తుందని ప్రకటించారు. అదనంగా, ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ బకాయిలు కలిపి, జూలై 1న లబ్ధిదారులకు మొత్తం రూ. 7,000 అందిస్తామని తెలిపారు. తెలిపినట్లే జులై నుండి పెంచిన పెన్షన్ ను అందజేస్తూ వస్తున్నారు. ఒకటో తారీఖున..పెన్షన్ దారుల ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్ ను వారి చేతిలో పెడుతున్నారు.

ఇక ఇప్పుడు మరో తీపి కబురు అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబు వివరించారు. మొన్నటి వరకు ఓ నెల పెన్షన్ తీసుకోకపోతే మరోసటీ నెల పెన్షన్ ఇస్తారో ఇవ్వరో అనే ఆందోళన పెన్షన్ దారుల్లో ఉండేది కానీ ఇప్పుడు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా పర్వాలేదని భరోసా ఇచ్చారు చంద్రబాబు.

Read Also : Rice Vada Recipe: మిగిలిన అన్నంతో.. ఇలా రైస్ గారెలు చేసేద్దాం..!