Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన, సభలు, సమావేశాలతో బిజీ బిజీ!

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యం. గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మరుసటి రోజు శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్, […]

Published By: HashtagU Telugu Desk
CBN Tour

chandrababu naidu sabha stampede

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యం. గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు.

కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మరుసటి రోజు శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్, రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్‌లో బహిరంగసభల్లో పాల్గొంటారు. జనసేన నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశాలు, టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మళ్లీ కుప్పంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేయనున్నారు.

చంద్రబాబు తన పర్యటన సందర్భంగా కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి కుప్పం మసీదులో ప్రార్థనలు చేసి అక్కడ ముస్లింలు, మైనార్టీలతో ముఖాముఖి సమావేశం కానున్నారు. చివరగా మల్లనూరు బస్టాండ్ ఏరియాలో బహిరంగ సభలో పాల్గొంటారు. తన పర్యటనకు ముందు చంద్రబాబు కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి, స్థానిక పార్టీ నేతలతో సమావేశమై ఆ ప్రాంత పరిస్థితులపై చర్చించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

అయితే చంద్రబాబు కుప్పం పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే చంద్రబాబు పర్యటన చేస్తున్నారని ఆరోపించారు.

Also Read: Saindhav: వెంకీ ‘సైంధవ్’ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 12 కోట్లు ఖర్చు

  Last Updated: 28 Dec 2023, 12:12 PM IST