Site icon HashtagU Telugu

Chandrababu : రేపు సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు..ఆ మూడు ఫైల్స్ సంతకం

Cbn Meeting First

Cbn Meeting First

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (Chandrababu)గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి..ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం గా చంద్రబాబు తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు , పలు రాష్ట్రాల అగ్ర నేతలు , సినీ ప్రముఖులు , నారా , నందమూరి , మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేసారు.

ఇక ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులకు వారి శాఖలను కేటాయిస్తారని అనుకున్నారు కానీ అది రేపటికి వాయిదా వేశారు. ఇక స్యాన్తరం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులతో సుమారు 20 నిమిషాల సేపు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్‌ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు.. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. వైఎస్‌ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు.. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. మరోవైపు.. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొనగా.. రేపటిలోగా శాఖలను కేటాయిస్తాను అని స్పష్టం చేశారు.

అలాగే రేపు గురువారం సాయంత్రం 4:41 గంటలకు చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు.

Read Also : Relationship Tips : ప్రతి అమ్మాయి, అబ్బాయి ఇష్టపడే లక్షణాలు