తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) కడప మహానాడు(Mahanadu)లో మాస్ వార్నింగ్ ఇస్తూ, వైసీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. అహంకారంతో విర్రవీగే వైసీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరింత గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. రాయలసీమలో 52 సీట్లకు 45 సీట్లు కూటమి గెలవడం, రాష్ట్రవ్యాప్తంగా 94% స్ట్రైక్ రేట్ సాధించడంతో కార్యకర్తల సమిష్టి శ్రమ స్పష్టమవుతుందని చెప్పారు. కడప మహానాడు సూపర్ హిట్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Mahanadu : “వై నాట్ 175” వారి అడ్రస్ ఏది..? – నారా లోకేష్ ఏమన్నా సెటైరా..!
క్లైమోర్ మైన్స్‌కే భయపడని తాను, కష్టాలు ఎదురైనా వెనుకడుగేయని నాయకుడినని స్పష్టం చేశారు. బీసీల కోసం రూ.47 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్, ఉద్యోగులకు సమయానికి జీతాలు అందించడంపై ఆయన స్పష్టత ఇచ్చారు. రాయలసీమను అభివృద్ధి గమ్యంగా మార్చే కార్యచరణలో భాగంగా, కడపలో స్లీట్ ప్లాంట్ పనులు జూన్ 12 నాటికి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
వైసీపీ పాలనలో చోటు చేసుకున్న ల్యాండ్, శాండ్, మైన్స్ దోపిడీని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. “ఇక్కడ ఉంది సీబీఎన్… గుర్తు పెట్టుకోండి” అంటూ మాస్ స్టైల్‌లో హెచ్చరించారు. ఇదిలా ఉంటే సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా జోష్‌తో ప్రసంగిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. కార్యకర్తలు అతన్ని ఆసుపత్రికి తరలించగా, సభా వాతావరణంలో ఆందోళన నెలకొంది.