AP TDP: విజయ నగరం జిల్లాపై చంద్రబాబు గురి, ఆశావహుల్లో గుబులు

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 08:54 AM IST

AP TDP: రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. సర్వేల మీద సర్వేలు, సమీకరణాల పైన సమీకరణాలు అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో పడుతున్నారు. విజయనగరం జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఇన్చార్జిలు. ఇప్పటికే జనసేన పొత్తుతో భాగంగా ఎవరికి ఎసురొస్తుందో తెలియక ఆందోళనలో ఉంటే, ఇప్పుడు సర్వేలు, ఐవిఆర్ఎస్ సర్వేలతో మరింత టెన్షన్ పడుతున్నారు నేతలు. అందులో భాగంగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో వస్తున్న ఐవిఆర్ఎస్ కాల్స్ సర్వే అటు ఇన్చార్జిల్లో, ఇటు ఆశావహుల్లో గుబులురేపుతుంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాయిస్ తో మీ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అని వస్తున్న ఫోన్ కాల్స్ ఆ పార్టీలో ఒకింత అలజడి రేపాయి.

కురుపాంలో జరిగిన ఐవిఆర్ ఎస్ సర్వేలో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న తోయక జగదీశ్వరి పేరు లేకుండానే కొత్తగా మరో ఐదుగురు పేర్లతో సర్వే కాల్స్ రావటం అందరినీ ఆశ్చర్యానికి గు. దీంతో కురుపాం ఇన్చార్జి జగదీశ్వరి తన పరిస్థితి ఏంటో తెలియక అయోమయంలో ఆందోళనలో పడ్డారట. తమకే సీటు దక్కుతుందని లక్షల రూపాయల అప్పు చేసి మరీ రాజకీయాలు చేస్తే ఇలా జరుగుతుంది ఏంటి అని మధనపడ్డారట.ఇక మరో నియోజకవర్గం సాలూరు. ఇక్కడ ప్రస్తుత ఇంచార్జిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి తో పాటు నియోజకవర్గానికి సంబంధం లేని మరో మహిళ పేరును కూడా సర్వేలో జరిపారంట.

ఆ కాల్స్ నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణులకు, ఇతర కేడర్ కి రావడంతో చర్చకు దారి తీసిందట. సంధ్యారాణి ప్రస్తుతం రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉండటంతో పాటు 2009 నుండి నియోజకవర్గంలోనే ఉంటూ రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయి మరీ రాజకీయాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా మరో మహిళను తెరపైకి తీసుకురావటం, ఇద్దరిలో ఒకరికి ఓటేయాలంటూ క్యాడర్ ను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం పార్టీ హార్డ్ కోర్ క్యాడర్ ఒకింత అసహనానికి గురయ్యారట. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఇన్చార్జిగా ఉండగా ఇక్కడ నాగార్జున తో పాటు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు కూడా ఐవీఆర్ఎస్ కాల్ సర్వే చేయడం చేసింది పార్టీ అధిష్టానం. దీంతో ఇక్కడ కేడర్ కూడా ఏమి జరుగుతుందో తెలియక డైలమాలో పడ్డారట.