TDP 40 Years : వైసీపీపై ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి అస్త్రం

తెలుగుదేశం పార్టీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు సిద్ధం కావాల‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు క్యాడ‌ర్ కు పిలుపు నిచ్చాడు. ఈ ఏడాది తో పార్టీకి 40 ఏళ్లు పూర్తి కాన్నాయి

  • Written By:
  • Publish Date - February 1, 2022 / 11:36 AM IST

తెలుగుదేశం పార్టీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు సిద్ధం కావాల‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు క్యాడ‌ర్ కు పిలుపు నిచ్చాడు. ఈ ఏడాది తో పార్టీకి 40 ఏళ్లు పూర్తి కాన్నాయి. ఆ సంద‌ర్భంగా ఉత్స‌వాల‌ను జ‌ర‌పాల‌ని భావిస్తున్నాడు, మే 29వ తేదీ నుంచి వ‌చ్చే ఏడాది మే 28వ తేదీ వ‌ర‌కు ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌ను ఆదేశించారు. ఆ సంద‌ర్బంగా ఎన్టీఆర్ పేరును అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని వైసీపీ చూస్తోన్న వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించాడు. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లో ఫోక‌స్ చేయాల‌ని దిశానిర్దేశం చేశాడు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటిన్ల‌ను టీడీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కేవ‌లం ఐదు రూపాయ‌ల‌కు అన్నం పెట్టేలా క్యాంటిన్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆనాడు చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా అన్న క్యాంటిన్ల‌ను పెట్టారు. ప్ర‌భుత్వం మారిన త‌రువాత వాటి పేర్ల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ మార్చేసింది. అలాగే, అన్న ఆరోగ్య శ్రీ పేరును కూడా తొల‌గించింది. ఆ స్థానంలో వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పేరును తీసుకొచ్చింది. ఆ మేర‌కు పేద‌ల‌కు ఆరోగ్య కార్డుల‌ను విడుద‌ల చేసింది. ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతి పేరును మార్చేసింది. ఇలా ప‌లు ర‌కాల ప‌థ‌కాల‌కు ఉన్న ఎన్టీఆర్ పేరును జ‌గ‌న్ స‌ర్కార్ మార్చేసింది. కానీ, విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డం ద్వారా వైసీపీ ల‌బ్ది పొందాల‌ను ప్లాన్ చేస్తోంది. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు క్యాడ‌ర్ కు తెలియ‌చేస్తున్నారు. ఎన్టీఆర్ చ‌రిష్మాను అనుకూలంగా మ‌లుచుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాల‌ని సూత్ర‌ప్రాయంగా లీడ‌ర్ల‌కు బాబు దిశానిర్దేశం చేశాడు. అందుకే, ఇప్పుడు శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది.