Site icon HashtagU Telugu

Chandrababu: రేపు ఉండవల్లికి చంద్రబాబు.. కుటుంబ సమేతంగా ఓటింగ్

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీలో ఈ సారి రికార్డుస్థాయిలో పోలింగ్ జరగబోతోంది. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానుండటంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటు వేయనున్నారు.  ఉండవల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ రోడ్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఓటు వేస్తారు.  గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ అధినేత ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఎన్నికల అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించనున్నారు. అయితే  తిరుపతిలో మోడల్ పోలింగ్ బూత్ ల అలంకరణ వివాదంగా మారినట్టు సమాచారం.  వైసిపి రంగులతో ఉన్న బెలూన్స్ తో పాటు కర్టెన్లు,షామియానాలు వేసారని టిడిపి ,జనసేన నేతల అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వెంటనే వాటిని తొలగించాలని తిరుపతి పార్లమెంటు అద్యక్షుడు నరసింహా యాదవ్ డిమాండ్‌‌ చేశాడు.