రాష్ట్రంలో శాంతిభద్రతలను భంగం కలిగించే చర్యలపై సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా ఖండించారు. ప్రజా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంగా తెలిపారు. తెనాలిలో గంజాయి కేసు నిందితులను పరామర్శించడం, పొదిలిలో మహిళలపై రాళ్ల దాడులు చేయడం వంటి ఘటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటివరకు నా మంచితనం చూశారు.. ఇకపై ఉపేక్షించను’’ అంటూ కఠిన హెచ్చరిక చేశారు. రౌడీయిజాన్ని ప్రోత్సహించే వారి పట్ల ఉమ్మడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Air crash incident : విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్
వైసీపీ (YCP) పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ఓర్చలేక కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిని ‘‘వేశ్యల నగరం’’ అన్నారు అంటూ మండిపడ్డారు. ‘‘దేవతల రాజధానిని అవమానించడమంటే ఎంత దారుణం!’’ అని ప్రశ్నించారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని అన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధేశపూర్వకంగా అశాంతికి గురిచేసే విధంగా వైసీపీ కార్యకలాపాలు సాగుతున్నాయని ఆయన విమర్శించారు.
వైసీపీ నేతలు వెళ్లే ప్రతి చోటా వివాదాలు జరుగుతున్నాయని, జనం మధ్య చిచ్చు పెట్టేందుకు రౌడీ మూకలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు వ్యవస్థ కట్టుదిట్టంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రౌడీయిజాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదని ఆయన తెలిపారు.