Chandrababu: మహారాష్ట్రలోని కొల్లాపూర్(Kolhapur) శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని(Shree Mahalakshmi Temple) రేపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సందర్శించనున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజాలు నిర్వహంచనున్నారు. అనంతరం చంద్రబాబు షిర్టీ చేరుకుని సాయిబాబాబ ఆలయాన్ని దర్శించుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇది ఒక పవిత్ర ప్రదేశం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. గత 10 ఏళ్లలో ఆయన చాలా బాగా పనిచేశారు. దేశానికి ఆయన అవసరం. రాబోయే రోజుల్లో ప్రపంచ వేదికపై భారతదేశం ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఎన్డీయే 400 సీట్లకు పైగా సాధించడం ఖాయం” అని చంద్రబాబు అన్నారు.
Read Also: Instagram Down: మరోసారి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్‌లో ఫిర్యాదులు..!
మరోవైపు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని చంద్రబాబు ధీమాగా ఉన్న చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈనేపథ్యంలోనే రేపు మహారాష్ట్ర వెళ్తున్నారు.