Site icon HashtagU Telugu

Amaravati : రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన చంద్రబాబు..

Babu Amaravati

Babu Amaravati

రాజధాని అమరావతి (Amaravati ) ప్రాంతంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. ఉండవల్లిలో గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజా వేదిక శిథిలాలను పరిశీలించారు. అనంతరం అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి బయల్దేరారు. ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఫౌండేషన్ స్టోనికి కొబ్బరికాయ కొట్టి నేలపై మోకరిల్లి నమస్కరించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించేందుకు సీఎం రాయపూడి బయల్దేరారు. కాగా 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధాని మోడీ విచ్చేసి రాజధానికి భూమి పూజ చేశారు.

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని, వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇందులో భాగంగా తొలుత జగన్‌ విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశంతో రాజధానిలో పర్యటిస్తున్నారు. ఉదయం 11:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది. ముందుగా జగన్‌ కక్షగట్టి కూల్చేయించిన ప్రజావేదికను చంద్రబాబు సందర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కూల్చివేతలకు చిరునామాగా నిలిచిన జగన్‌ ప్రభుత్వంలో, కనీసం ఆ శిథిలాలను కూడా తొలగించలేదు. చంద్రబాబు కూడా జగన్‌ చేసిన విధ్వంసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, ప్రజావేదిక శిథిలాల తొలగింపు చేపట్టమని ఇటీవల తేల్చిచెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్‌ యాక్సెస్​ రహదారిపైకి వెళ్లారు. దారి పొడవునా ఎక్కడా తట్ట మట్టిసిన పరిస్థితి లేకపోవడాన్ని కళ్లారా చూశారు. రాజధాని రైతుల ఆవేదనను కళ్లకు కడుతూ భూములన్నీ, జగన్‌ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవడాన్ని గమనించారు. సీడ్‌ యాక్సెస్​ రహదారి మీదుగా చంద్రబాబు అమరావతి శంకుస్థాపనన జరిగిన ఉద్ధండరాయునిపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు. ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఫౌండేషన్ స్టోనికి కొబ్బరికాయ కొట్టి మోకాళ్లపై ప్రణమిల్లారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించేందుకు సీఎం రాయపూడి బయల్దేరారు. మరికాసేపట్లో మీడియా తో సమావేశం కానున్నారు.

Read Also : PM Kisan Samman Nidhi: 17వ విడుత పీఎం కిసాన్‌ నిధులు బ్యాంక్‌ అకౌంట్లోకి రాలేదా..? అయితే కారణమిదే..?