AP Politics: చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఫోటో, రాజకీయ వైరల్ కోణం!

తారకరత్న భౌతిఖాయం సాక్షిగా చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • Written By:
  • Publish Date - February 20, 2023 / 03:07 PM IST

తారకరత్న భౌతిఖాయం సాక్షిగా చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి ఉన్న ఫోటో రాజకీయ (Politics) చర్చకు, వ్యక్తిత్వాల పొలికకు దారి తీసింది. దానికి ఆజ్యం పోస్తూ టాలీవుడ్ నిర్మాత , కాంగ్రెస్ లీడర్ బండ్లగణేష్ ట్వీట్ కామెంట్ చేశారు. అది వైరల్ గా మారడంతో టీడీపీ సోషల్ టీం రంగంలోకి దిగింది. వివరణాత్మక కథనాన్ని , సంఘటనలను గుర్తు చేస్తుంది.

చంద్రబాబు నాయుడుకి సిగ్గులేదా?

ఈ జన్మలో రాదా? అనే నెటీజన్లకు ఇదో పెద్ద న్యూస్. మొన్న వైజాగ్ భూముల విషయంలో, తన కూతురు, అల్లుడి పేరున భూములు కొంటే సర్వే నంబర్లతో సహా మీడియాలో వస్తే.. రామూ అని రామోజీరావును ఏకవచనంతో దూషిస్తూ.. చంద్రబాబును కూడా చేర్చి ఇటీవల చెడమడా
విజయసాయిరెడ్డి తిట్టారు.

చంద్రబాబుకు మతిస్థిమితం లేదనే వరకూ.. లోకేశ్ నూ వదలక వైకాపా చేసిన వ్యక్తిత్వ హననం క్రతువుకు నాయకత్వం వహించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టే వారందరినీ పలకరించరిడం సరికదా.. అభివాదం చెయ్యడం కూడా నాయుడికి సాధ్యపడనంత జనం. తెలిసిన నాయకులు, అభిమానులు, రాజకీయేతర (Politics) రంగాల ప్రముఖులు చుట్టుముడతారు. అలాంటి నాయుడు సినీ, రాజకీయ (Politics) ప్రముఖులు ఆంధ్రా తెలంగాణా పార్టీ అభిమానులు చివరిచూపు చూడడానికి విపరీతంగా వచ్చిన తారకరత్న ఇంటి వద్ద “అరగంటకు పైగా” విజయసాయిరెడ్డితో మాట్లాడడం పైగా నాయుడి వెంట విజయసాయిరెడ్డి వుండడం చూసి.. చావింట అయినా సరే.. బంధువులు అయినా సరే.. సగటు నాయుడి అభిమానికి మనసులో కలిగే అభిప్రాయం నాయుడుకి సిగ్గులేదా.. ఇక రాదా అనే.అందులో అభిమానుల తప్పులేదు.కానీ నాయుడు ఎందుకిలా మొహం ఇచ్చాడు విజయసాయిరెడ్డికి అనే ఆలోచన రాకమానదు.

మోసపోయిన వారు, పశ్చాత్తాపంతో శరణు కోరితే, అన్నీ మరిచిపోయి కరిగిపోయే ఔదార్యం నాయుడికి ఉంది.ఆ కోణంలో ఆలోచిస్తే ఎవరు మోసపోయారో, విజయసాయిరెడ్డి కోణం నుండి ఆలోచించాలి. చెన్నైలో అత్యంత కష్టమైన చార్టెడ్ అకౌంటెన్సీ చదువు పూర్తి చేసి, అక్కడే పనిచేసి అనుభవం సంపాయించి, రాజారెడ్డి కాలంలో సంధింటి ఆడిటర్ గా చేరాడు. ఒకసారి మాఫియాలో చేరితే బయటకు రాలేనట్లు సంధింటి పాపపు లెక్కల్లో భాగమై ఏ1 జగన్ రెడ్డి వెన్నంటి ఏ2గా విజయసాయిరెడ్డి కూడా చంచల్ గూడలో జైలుజీవితం గడపాల్సి వచ్చింది. అప్రూవర్ గా మారే అవకాశం వున్నా సంధింటి ఉప్పుతిన్నామనే కృతజ్ఞత, నమ్మకం, ఆయన్ని ఆ పనిచేయించలేదు.

జగన్ వెంట వున్నాడు. ముందుండి సోషల్మీడియా బాధ్యతల నుండి ఢిల్లీ వరకు లాబీయింగ్ చేసి విజయవంతంగా జగన్ రెడ్డికి జనం ఒక్క ఛాన్స్ ఇచ్చేవరకు, మడమతిప్పలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయసాయిరెడ్డిని గట్టిగా ఆలింగనం చేసుకొన్న దృశ్యాలు మనం చూసిందే.జగన్ రెడ్డికి అధికారం వచ్చాక కూడా విజయసాయిరెడ్డి కృతజ్ఞత కొనసాగింది. సంధింటి గొడ్డలిపోట్లను కాపాడడానికి పురమాయించగానే.. సాక్షి ముందుకు వచ్చి గుండెపోటు అని మొదటి సంతాపంను వైకాపా మరియు సంధింటి తరపున వ్యక్తం చేశారు లోకానికి.

వైకాపా ప్లీనరీలో శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ను ప్రకటించమని చెబితే, ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రకటించి, ఆ తీర్మాణం నెగ్గిందని పార్టీ చేత చప్పట్లు కొట్టించారు.కానీ జగన్ రెడ్డి మారాడో.. వేరే ఎవ్వరైనా మార్చారో.. అప్పటి వరకు రెండో స్థానంలో వున్న విజయసాయిరెడ్డిని దూరంగా ఉత్తరాంధ్రకు పంపారు. ఏ1 జగన్ రెడ్డి ఆర్జనకు పావైన తాను, మళ్లీ శిక్షపడక ముందే వున్న ఏకైక కూతురి కోసం భూములు కొనుగోలు చేశాడు, వారి డబ్బులతో దగ్గరుండి చేశాడు.

మీడియాలో సర్వే నంబర్లతో సహా వచ్చే సరికి విస్తుపోయాడు. కోపం నసాలానికి తాకి, ఆలోచన నశించి నోటికొచ్చింది తిట్టాడు నాయుడిని, రామోజీరావును ,ఆర్కేని.

మళ్లీ స్థిమితంగా ఆలోచించి వుంటాడు కదా. తానొక్కడి భూముల సర్వే నంబర్లు మాత్రమే ఎందుకు వచ్చాయి అని. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు, ఎమ్మెల్యేల ఫోన్లతో సహా నిఘా వుంచే తాడేపల్లి హస్తం వుందేమో అనే ఆలోచన రాకుండా మనసును
నియంత్రించుకోవడం కష్టం కదా. దానికి తోడు.. వైజాగ్ లో ప్రధాని మోదీ సభకు జనాన్ని తరలించడానికి రమ్మని, ఆయన ముందు జగన్ వెంట వైజాగ్ లో కనిపించే ఆఖరి అదృష్టం కలిగింది విజయసాయిరెడ్డికి.

అదవ్వంగానే ఉత్తరాంధ్ర ఆధిపత్యం కూడా విజయసాయిరెడ్డికి పీకేసి, వైవీ సుబ్బారెడ్డికి పట్టం కట్టారు. ఒక విధంగా వైజాగ్ నుండి తరిమేశారు.
అక్కడితో ఆగకుండా పార్టీలో ఆయన పాత్రను అనుబంధ సంఘాల సమన్వయ పదవికి కుదించారు. అయినా సహిస్తూ కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఆ తరువాత అవీ ఆగిపోయాయి అనేకన్నా సహకారం అందకుండా చేశారు.

ఇసి నుండి పార్టీ శాశ్వత అధ్యక్షుడు ఏంది.. విచారణ చేసి నివేదిక ఇవ్వమని కార్యదర్శిగా విజసాయిరెడ్డిని ఆదేశిస్తే.. ఆయన స్పందించకముందే.. మీడియా ముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీ లేఖపై స్పందిస్తూ.. జగన్ ఒప్పుకోలేదు అని తానే ప్రకటించేశారు.అయినా సాయిరెడ్డి సహించాడు.

సోషల్మీడియా ఇంచార్జ్ గా వున్న విజయసాయిరెడ్డిని పీకేసి, సజ్జల ముద్దుల పుత్రరత్నాన్ని వైకాపా ప్రకటించింది. ఆఖరికి తన ఫోన్ కూడా తాడేపల్లిలో ఇచ్చేసి వెళ్లమన్నారు అనే వార్తలు హల్చల్ చేయంగానే.. జగన్ పురమాయించగానే తన ఫోన్ పోయింది అని ఆంధ్రాలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెళ్లిపోయారు.

మూడు దశాబ్దాలకు పైగా సంధింటి సేవలో అనుభవంచిన దానికంటే వ్యక్తిగత జీవితం కోల్పోయిందే ఎక్కువ. రెండో స్థానం నుండి ఫోన్ కూడా పోగొట్టుకొని పార్టీలో ఏ స్థానమూ లేని పరాభవం. ఆ బాధను కూడా బయటకి వ్యక్తం చెయ్యకుండా.. ట్వీట్లలో బూతులు, కఠిన తిట్లు, శాపనార్థాలు స్థానంలో సౌమ్యత వచ్చి చేరింది. లోకేశ్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పడంతో అంతా
ఆశ్చర్యపోయారు.

ఎక్కడ ఎవరు ఎదురుపడ్డా.. శత్రువునైనా నాయుడు పలకరిస్తాడు లేదా అభివాదానికి స్పందించి తిరిగి అభివాదం చేస్తాడు. ఇందులో బేషజాలకు పోరు. కానీ కానివారితో రాసుకుపూసుకు మాట్లాడరు.

విజయసాయిరెడ్డితో అరగంటకు పైగా సిగ్గులేకుండా మాట్లాడలేదు. బాలయ్యకు కృతజ్ఞతలు చెబుతూ మీడియా ముఖంగా అంతకుముందు కొన్ని రోజులకు ముందే మాట్లాడారు. నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు గానీ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చెప్పారు. ఇప్పుడు కూడా అందరికీ & తెలవాల్సిన వారికి తేలిసేలా నాయుడితో మాట్లాడడమే కాకుండా వెంట తిరుగుతూ తెలిసేలా చేశాడు.

వైఎస్సార్ నీడ సూరీడు లెక్కన
వైఎస్సార్ ఆత్మ కెవిపి లెక్కన

జగన్ వెంట నమ్మి నిలిచి జీవితాన్ని దారపోసిన రెండో వ్యక్తిగా జరిగిన ద్రోహం గురించి కరివేపాకు అయినామనే కల్లోల అంతరంగంలో చెలరేగిన ఘర్షణలో.. పావుగా మారి చేసిన పాపాలకు పశ్చత్తాపంతో కొంత కొంత బయటపడుతున్నాడు విజయసాయిరెడ్డి.

ఆయన తన మనసు భారాన్ని దింపుతూ ముందే ఫోన్లో మాట్లాడి, ఇప్పుడు బాహాటంగా మాట్లాడడానికి వైకాపా నుండి సాహసించి వుండవచ్చు. జాలితో నాయుడు కూడా విని అర్థం చేసుకొని వుండవచ్చు, జనం కోసం.

తనకు తానే కూలబోతున్న జగన్ విషయంలో బాహాటంగా ఏమీ వ్యతిరేకంగా చేయకపోయినా విజయసాయిరెడ్డి తన భద్రత చూసుకొంటూ జాగ్రత్తగా అడుగులు వెయ్యడం మంచిదని సోషల్ మీడియా వేదికగా బాబు అభిమానులు సలహాలు ఇస్తున్నారు.

Also Read:  Delivery Agent: ఐఫోన్ కి డబ్బులు లేవని డెలివరీ ఏజెంట్ ని చంపేసిన ఓ వ్యక్తి