Site icon HashtagU Telugu

Chandrababu Tweet: ఇంద‌ చాట‌.. నాలుగంటే నాలుగు!

Chandrababu Floods

Chandrababu Floods

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ‌ర‌ద స‌హాయంపై టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా చ‌మ‌త్కారం విసిరారు. నాలుగు ఉల్లిపాయ‌లు, నాలుగు ట‌మాటాలు, నాలుగు బంగాళాదుంప‌లు వేసిన చేట‌ను జ‌త చేస్తూ జగ‌న్ స‌ర్కార్ వాల‌కాన్ని నిల‌దీశారు. మూడు రోజుల పాటు వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డానికి మూడు రోజులు షెడ్యూల్ చేసుకున్న చంద్ర‌బాబు విచిత్ర‌మైన ట్వీట్ ను చేయ‌డం గ‌మ‌నార్హం.

భారీ వ‌ర్షాల కార‌ణంగా ఏపీలోని వంద‌లాది ప‌ల్లెలు వ‌ర‌ద‌ల్లోనే ఉన్నాయి. బాధితుల‌ను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తోంది. బాధితుల‌కు అందించిన వ‌ర‌ద సాయం ఇదేనంటూ చంద్ర‌బాబు నాయుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఫొటోను పంచుకున్నారు. నాలుగంటే నాలుగేనంటూ ఆయ‌న స‌ద‌రు పోస్ట్‌కు కామెంట్ జ‌త చేస్తూ చేట ఫోటోను పెట్టారు.

గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం లెక్క చూసుకో జగన్ రెడ్డి. నాలుగంటే నాలుగే! అంటూ చంద్ర‌బాబు ఓ సెటైర్ సంధించారు. ఆయ‌న వ‌ర‌ద ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం నుంచి షెడ్యూల్ ప్ర‌కారం ప‌ర్య‌టించాలి. కానీ, కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న షెడ్యూల్ ను మార్చుకున్నార‌ని తెలుస్తోంది. ఆ లోపుగా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ స‌ర్కార్ మీద సెటైర్లు వేస్తూ వ‌ర‌ద స‌హాయాన్ని ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.