Site icon HashtagU Telugu

Chandrababu: ప‌ల్నాడులో చంద్ర‌బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం

Y Not 160

Chandrababu

గుంటూరు జిల్లా పల్నాడు జ‌నం టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. భారీ వ‌ర్షాల‌తో పంట‌ల‌ను కోల్పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఆయ‌న వెళ్లారు. ఆ సంద‌ర్భంగా రైతుల‌కు భ‌రోసా ఇస్తూ రాష్ట్రాన్ని కాపాడుకుందాం! రండి! అంటూ పిలుపు నిచ్చారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పలు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలకు బాబు వెళ్లారు. నాదెండ్ల, తుబడు, నరసరావుపేట, పలనాడు రోడ్డు రావిపాడు, నకిరేకల్లు కొండమూడు, పిడుగురాళ్లు, దాచేపల్లి త‌దిత‌ర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు.

వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టం వివరాలను చంద్ర‌బాబు తెలుసుకున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాలలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వ‌హించారు. సాయంత్రం 5 గంటలకు గురజాల సభలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రసంగించ‌డంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగుస్తుంది. రైతుల‌ను ఆదుకోవాల‌ని, పంట‌న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయ‌నున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌ల్నాడు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.