తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన (Tirupati Stampede Incident) ప్రజలను విషాదంలో ముంచింది. వైకుంఠ ఏకాదశి (Tirumala – Vaikunta Ekadasi) సందర్భాంగా టికెట్ టోకెన్స్ పంపిణి కేంద్రాల బుధువారంజరిగిన తొక్కిసలాటలో దాదాపు ఆరుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన పై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించారు. అధికార వైఫల్యాలపై సమీక్ష చేయడానికి హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులను తిరుపతికి పంపించారు. ప్రజల భద్రత విషయంలో రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతికి చేరుకున్న మంత్రులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సహాయార్థం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు.
Read Also : Younis Khan: ఆఫ్ఘనిస్థాన్ మెంటార్‌గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 11 గంటలకు తిరుపతికి చేరుకోనున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల కుటుంబాలతో మాట్లాడనున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు లేకుండా భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయాలని అధికారులకు సూచించనున్నారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసం కోల్పోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నది.