Chandrababu: ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ జనాల్లోకి వెళ్తుండటంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లుతున్నారు.
బీజేపీ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఏపీలో పొత్తులపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ నాయకులతో పవన్ కూడా భేటీ అయ్యే చాన్స్ ఉన్నది. అనంతరం, ఏపీలో పొత్తులపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనల మధ్య అవగాహన కుదిరింది. ప్రచారంపైనా ఓ అవగాహన ఉన్నది. కానీ, బీజేపీ నుంచే ఎలాంటి సంకేతాలు రాలేవు. అయితే జనసేన తమ పొత్తు ఉంటుందని చెప్పిన బీజేపీ, టీడీపీతో మాత్రం తేల్చలేకపోయింది.
దీంతో ఈ రెండు పార్టీలకు బీజేపీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తుందా? అనే అనుమానాలు వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పంపకాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బీజేపీతో ఇప్పటికే జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన కూడా వెళ్లి పార్టీ పెద్దలను కలసి వస్తారని తెలిసింది.