ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) రేపు అచ్యుతాపురానికి (Atchutapuram ) వెళ్లనున్నారు. బుధువారం అనకాపల్లిలోని అచ్యుతాపురం (Atchutapuram ) ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన (Reactor Explosion) ఘటన తెలిసిందే. ఈ ఘటన లో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 16 కు చేరింది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం కాస్త తప్పింది.
రియాక్టర్ పేలుడుతో కుప్పకూలిన భవనం ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు శిథిలాల కింద మరికొందరి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు మొత్తం 22 మంది వరకు చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫార్మా సెజ్‌లో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో పక్కనున్న గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. సెజ్‌లో మంటను అదుపులోకి తేవడానికి 11 అగ్ని మాపక వాహనాలు వచ్చాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.
ప్రమాదం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టూ పొగలు అల్లుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి.. ఫార్మా ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రేపు గురువారం ఉదయం అచ్యుతాపురానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.
Read Also :