Site icon HashtagU Telugu

CBN : డిసెంబర్ 1న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోనున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు

chandrababu naidu

chandrababu naidu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1వ తేదీన తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకోనున్నారు.  ఆల‌యంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. నవంబర్ 30న తిరుమలకు చేరుకుని రాత్రికి శ్రీ రచన అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం శ్రీ భూ-వరాహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంత‌రం వెంకటేశ్వర స్వామిని ద‌ర్శించుకుని పూజలు చేయ‌నున్నారు. అదే రోజు చంద్ర‌బాబు నాయుడు అమరావతికి తిరిగి రానున్నారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలోని ప‌లు ఆల‌యాలను సంద‌ర్శించి పూజ‌లు చేయాల‌ని భావించారు. అయితే అనారోగ్యం కార‌ణాల‌తో ఆల‌యాల సంద‌ర్శ‌న వాయిదా ప‌డింది. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న అనంత‌రం విజయవాడలోని కనకదుర్గ ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, సింహాచలం నరసింహస్వామి ఆలయాలను కూడా చంద్ర‌బాబు సంద‌ర్శించి పూజ‌లు చేయ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. ఈ ఆలయ సందర్శనల తర్వాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తన అధికారిక రాష్ట్రవ్యాప్త పర్యటన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు.

Also Read:  Mansoor Ali Khan : ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి వెయ్యి కోట్లు సంపాదించాడు – నటుడు మన్సూర్ అలీ