Site icon HashtagU Telugu

CBN : ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..ఐదు కీలక హామీలపై సంతకాలు

Cbn Take

Cbn Take

ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో బుధువారం ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా..పవన్ కళ్యాణ్ తో సహా 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న చంద్రబాబు..ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ కు వచ్చారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు. అంతకు ముందు అమరావతి చేరుకున్న చంద్రబాబుకు రైతులు ఘన స్వాగతం పలికారు. సీఎం మార్గమధ్యలో తన కాన్వాయ్ను ఆపి వారితో మాట్లాడారు. అనంతరం సచివాలయంకు చేరుకొని మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

Read Also : Vastu Dosha: మీ ఇంట్లో వాస్తు దోషం ఉండకూడదంటే.. ఈ ఒక్క వస్తువు అక్కడ పెట్టుకోవాల్సిందే?