ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(APGovt)లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం (NDA Govt) ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (Women’s Day) పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ అందించేందుకు సిద్ధమయ్యారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ వస్తున్న ఆయన, ఈసారి లక్ష మందికి పైగా మహిళలకు జీవితాన్ని మార్చే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా వారికి టైలరింగ్ శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నిస్తోంది.
టైలరింగ్ శిక్షణతో స్వయం సమృద్ధికి మార్గం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 1,02,832 మంది మహిళలు టైలరింగ్ శిక్షణ పొందనున్నారు. 90 రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మహిళలకు ప్రామాణికమైన కోర్సులను అందించడంతో పాటు, ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు అదనపు చేయూతనూ ప్రభుత్వం అందించనుంది.
పథకానికి అర్హులెవరెవరు?
ఈ శిక్షణా కార్యక్రమానికి బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EBC), కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వీరికి అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా సమకూర్చనున్నారు. ఆసక్తి గల మహిళలు గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం, 70% హాజరు పూర్తిచేసిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను కూడా అందించనుంది.
మహిళా సాధికారత కోసం కీలక ముందడుగు
ఈ పథకం ద్వారా లక్ష మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కూడా లభించనుంది. స్వయం ఉపాధిని పెంచేందుకు ఈ పథకం ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. మహిళా సాధికారత కోసం చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చేలా కనిపిస్తోంది.
R. S. Praveen Kumar : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రవీణ్ కుమార్ ఫైర్