శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల (Chandrababu Srikakulam Tour) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను కేవలం బటన్ నొక్కే నాయకుడు కాదని, ప్రజల మద్యకి వచ్చి వారి కష్టాలను నేరుగా తెలుసుకుంటున్నానని స్పష్టం చేశారు. గత పాలకులు ప్రజల సమస్యలను చూసేందుకు చెట్లు నరికేసి, పరదాల వెనక కార్యకలాపాలు నిర్వహించేవారని విమర్శించారు. తాను మాత్రం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని పెంచే విధంగా పని చేయాలని, ప్రజల జీవితం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నాయుడు తెలిపారు.
మత్స్యకారుల అభివృద్ధికి పలు పథకాలు
మత్స్యకార కుటుంబాలకు మద్దతుగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని చంద్రబాబు నాయుడు వివరించారు. వేట విరామ సమయంలో జాలర్లకు రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు 1,29,178 కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని, ఏడాదిలోగా ఈ హార్బర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మత్స్య సంపదలో ఏపీ వాటా 29 శాతం ఉందని గర్వంగా పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.
విద్య, ఉపాధికి ప్రత్యేక ప్రాధాన్యత
మత్స్యకారుల పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించామని, మత్స్యకార పిల్లలు మంచి విద్య పొందేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఎచ్చెర్లలో ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రం కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ద్వారా ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Former Minister Harish Rao: తెలంగాణ అంటేనే బీఆర్ఎస్: మాజీ మంత్రి