Site icon HashtagU Telugu

Chandrababu : నేతలను బుజ్జగించే పనిలో బాబు..

Babu Bujaginpu

Babu Bujaginpu

ఏపీలో ఎన్నికల వేడి నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని పార్టీలలో టికెట్ల అంశం నడుస్తుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..రాకపోతే ఆ నేతలు ఆ పార్టీలలో కొనసాగుతారో లేదో ఇలా అనేక విధాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ(YCP) టికెట్ల విషయంలో దూకుడు కనపరుస్తుంది. నియోజకవర్గాలలో ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ లేదంటే అంతే సంగతి అని ముందు నుండే చెపుతూ వచ్చారు జగన్. అదే విధంగా ఇప్పుడు టికెట్ల ను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక టిడిపి..జనసేన పొత్తు పెట్టుకోవడం తో కొంతమందికి మొండిచెయ్యి చూపిస్తుంది. దాదాపు 30 సీట్ల వరకు జనసేన కు ఇవ్వబోతుంది. ఈ క్రమంలో ఆ 30 స్థానాలకు సంబదించిన టిడిపి నేతలతో బాబు మాట్లాడుతూ..బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సీట్ల త్యాగం చేసిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యం ఉంటుందని చెపుతూ వారికీ భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని…మరోసారి జగన్(Jagan) కు అవకాశం ఇస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని నేతలకు బాబు సూచిస్తున్నారు. కాబట్టి మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన చోట ప్రతిఒక్కరూ సహకరించాలని అందరితో కలిసి నడవాలన్నారు.

ఎమ్మెల్యే టికెట్ రాలేదని అస్సలు బాధపడకూడదనీ, ఎమ్మెల్సీ(MLC), రాజ్యసభ(Rajya Sabha) సీట్లలో సర్దుబాటు చేస్తామని…కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని వారికీ హామీ ఇస్తున్నారు. ఈమేరకు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన….టిక్కెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని కోరారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం మన పార్టీలో చేరుతాం అంటున్నారని..వారి గుణగణాలు పరిశీలించి, పార్టీ బలోపేతానికి పనికొస్తారనుకున్న వాళ్లనే తీసుకుంటామన్నారు. అలాంటి వారితోనూ కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. మరి వీరిలో ఎంతమంది సర్దుకుంటారో..ఎంతమంది బయటకు వస్తారో చూడాలి.

Read Also : Maharashtra : లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు