Site icon HashtagU Telugu

Chandrababu Speech in Prajagalam : జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే – చంద్రబాబు

Babu Speech Prajagalam

Babu Speech Prajagalam

జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే ..అని అన్నారు మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో పాటు మూడు పార్టీల నేతలు , కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ఫై నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గెలుపు ఎన్డీఏదే, ఎవరికీ అనుమానం లేదని పేర్కొన్నారు. మోడీకి అండగా ఉంటామని చెప్పేందుకే ప్రజలు తరలివచ్చారని పేర్కొన్నారు. ప్రజాగళం సభ, రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా అని వెల్లడించారు. ఐదేళ్లుగా విధ్వంస, అహంకార పాలన చూశామని, ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించేందుకే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు తెలిపారు. మీరు ఇచ్చిన తీర్పే మీ జీవితాలను నిర్ణయిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలు ఎన్డీఏకు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా నినాదమని చంద్రబాబు తెలిపారు. మోడీ ఒక వ్యక్తి కాదు, భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తిని అని కొనియాడారు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి అని పొగడతలతో మొచ్చేతారు బాబు. మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మవిశ్వాసమని చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీని కొనియాడారు.

We’re now on WhatsApp. Click to Join.

అమరావతిని సీఎం జగన్ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ‘కేంద్ర సహకారంలో మేము 70 శాతం పోలవరం పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. లాండ్, శాండ్, మైన్, వైన్స్ పేరుతో దోచేశారు. జే బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి తన ఆదాయాన్ని పెంచుకున్న దుర్మార్గుడు జగన్’ అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారని ఆరోపించారు. జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనలో ఎవరికైనా లాభం జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మన పిల్లల జీవితాలు బాగుపడేందుకే పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు.

Read Also :