Kuppam : కుప్పం మోడ‌ల్ ‘ఢీ అంటే ఢీ’

సంక్షోభం నుంచి అవ‌కాశాల‌ను రాబ‌ట్టాల‌ని చంద్ర‌బాబు చెబుతుంటారు. సంఘ‌ర్ష‌ణ నుంచి అద్భుత ఫ‌లితాల‌ను తీయాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం ఆయ‌న‌కు పుష్క‌లంగా ఉంటుంది. కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు కూడా ఆ విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు.

  • Written By:
  • Publish Date - January 6, 2022 / 03:57 PM IST

సంక్షోభం నుంచి అవ‌కాశాల‌ను రాబ‌ట్టాల‌ని చంద్ర‌బాబు చెబుతుంటారు. సంఘ‌ర్ష‌ణ నుంచి అద్భుత ఫ‌లితాల‌ను తీయాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం ఆయ‌న‌కు పుష్క‌లంగా ఉంటుంది. కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు కూడా ఆ విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు. చావోరేవో తేల్చుకోవ‌డానికి సిద్ధం కావాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్ధేశం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు సిద్ధం ముందుగా కుప్పం నుంచే తేల్చుకోవ‌డానికి వెళ్లాడు. మూడు రోజుల పాటు అక్క‌డే ఉంటున్నాడు. రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌తికారం తీర్చుకోవ‌డానికి ఇప్ప‌టి నుంచి తిరుగులేని స్కెచ్ కు ప‌దును పెడుతున్నారు.ఈసారి కుప్పం నుంచి చంద్ర‌బాబు పారిపోతాడ‌ని వైసీపీ చేసిన విస్తృత ప్ర‌చారం. ఆయ‌న ఓడిపోక‌పోతే, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇప్ప‌టికే భీష్మించాడు. ఆ మేర‌కు మున్సిప‌ల్, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీని తిరుగులేని మెజార్టీల‌తో గెలిపించాడు. ఇక చంద్ర‌బాబును కుప్పం నుంచి పంపించ‌డ‌మే మిగిలి ఉంద‌ని పెద్దిరెడ్డి ప‌దేప‌దే చెబుతున్నాడు. అందుకే కుప్పం నుంచే త‌ఢాఖా చూపించ‌డానికి చంద్ర‌బాబు స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల‌తో వెళ్లాడు.

ఢీ అంటే ఢీ..అంటూ చావోరేవో క్షేత్ర స్థాయిలో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డ వాళ్ల‌కు చంద్ర‌బాబు అవ‌కాశాలు ఇవ్వ‌నున్నాడు. ఆ మేర‌కు ఆయ‌న జ‌ల్లెడ ప‌డుతున్నాడు. నికార్సైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు, లీడ‌ర్ల కోసం అన్వేష‌ణ చేస్తున్నాడు. ఇప్ప‌టికే జాబితాను సిద్ధం చేసుకున్న ఆయ‌న ఇప్ప‌టి నుంచే కుప్పం క్షేత్రంలో యుద్ధానికి తిగుతున్నాడు. మూడు రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటూ కోవ‌ర్ట్ ల‌ను తొలి విడ‌త ఏరిపారేయ‌డానికి సిద్ధం అయ్యాడు. మ‌లి విడ‌త కోవ‌ర్ట్ ల స్థానంలో పోరాడే వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నాడు. తుది విడ‌త అస్త‌శ‌స్త్రాల‌ను సంపూర్ణంగా అందించ‌డం ద్వారా వైసీపీని త‌రిమి కొట్టాల‌ని స్కెచ్ వేశాడు.కుప్పం నుంచి చావోరేవో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డే వాళ్ల‌ను చంద్ర‌బాబు ఆహ్వానిస్తున్నాడు. కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని చంద్ర‌బాబు చెప్పాడు. స్థానికంగా ఉండే కొంద‌రు లీడ‌ర్లు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బ త‌న‌కు ప‌డే దెబ్బగానే భావించి భ‌విష్య‌తు లో క‌సి తీర్చుకుందామ‌ని పిలుపునిచ్చాడు. దీంతో నూత‌నోత్సాహంతో క్యాడ‌ర్ చంద్ర‌బాబుకు నీరాజ‌నాలు పలుకుతున్నారు. ఢీ అంటే ఢీ..ఈక్వేష‌న్ కుప్పం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల్లో ప్రాథ‌మికంగా అంతా సెట్ చేసి యుద్ధానికి సిద్ధం చేయ‌నున్నాడు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కుప్పం మోడ‌ల్ ను ప‌రిచ‌య‌డం చేయ‌డానికి చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. సో..ఇక చంద్ర‌బాబు ఆగ‌డు..దూకుడుగా వెళ్ల‌నున్నాడ‌న్న‌మాట‌.