Site icon HashtagU Telugu

TDP Kidnapping: టీడీపీ పోలింగ్ ఏజెంట్ల కిడ్నప్.. చంద్రబాబు సీరియస్

TDP Kidnapping

TDP Kidnapping

TDP Kidnapping: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంటేనే ఒక రేంజ్ లో హైప్ ఉంటుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అంతగా ఆ ఫీవర్ కనిపించనప్పటికీ ఈ సారి ఏపీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతుంది. కొన్ని చోట్ల అధికార పార్టీ వైసీపీ. టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పోలింగ్ తీరుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు… ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నిస్తే టీడీపీ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. నిబంధనల ప్రకారమే ఓటింగ్ ప్రక్రియ కొనసాగాలని, ప్రజాభీష్టం నెరవేరాలని ఆయన చెప్పారు. రౌడీయిజంతో, గుండాయిజంతో తమ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రంలో ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కమిషన్ ని కోరారు చంద్రబాబు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడాలని సంబంధిత అధికారులని డిమాండ్ చేశారు. కాగా పోలింగ్ ఏజెంట్లను పెట్టుకునేందుకు ప్రతి పార్టీకి హక్కు ఉందని, ఏజెంట్లను అనుమతించాలని సూచించారు. అయితే పుంగనూరు, మాచర్లలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రారంభం కాగానే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓటింగ్ కోసం 46,389 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, ఇందులో 4.14 కోట్ల మంది ఓటర్లు 2,841 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

Also Read: AP Elections 2024 : మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్