Site icon HashtagU Telugu

CBN : జగన్ కు అసలైన ఆట చంద్రబాబు చూపించబోతున్నాడా..?

Jagan Jailu

Jagan Jailu

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇక రానున్నది గడ్డుకాలమేనా..? మళ్లీ జగన్ కు జైలు జీవితం తప్పదా..? పాతకేసులన్నీ కూటమి సర్కార్ బయటకు తీయబోతుందా…? ఆ కేసులన్నింటి నుండి జగన్ తప్పించుకోవడం కష్టమేనా..? అంటే అవుననే అంటున్నారు కూటమి నేతలు. రిషికొండలో రూ.500 కోట్లతో భవనాలు కడతావా..? ప్రజాధనాన్ని నీ విలాసం కోసం వినియోగిస్తావా..? జగన్‌ కాస్కో..నీ ఫై ఉన్న కేసులు రీఓపెన్ చేస్తా… సిద్ధమా..? అంటూ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు (Chandrababu) సవాలు చేశారు. దీని బట్టి చూస్తే జగన్ కు ముందుంది ముసళ్ల పండగ అనే అనిపిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గడిచిన ఐదేళ్లలో నేనే రాజు..నాకు ఎదురులేదు..నేను చెప్పిందే వేదం..నేను చెప్పిందే జరగాలి..నేను ఏంచెపితే అదే..నేను ఎవర్ని చంపిన అడిగేవాడు లేడు..నా రాష్ట్రంలో నాకు ఎదురులేదు..తిరుగులేదు..అన్నట్లు వ్యవహరించారు. అధికారం ఎప్పటికి ఒకరి చేతిలోనే ఉండదు..ఇలా చెయ్యకూడదు..ప్రజలు క్షమించరు..వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది అనేది కూడా మరచిపోయి..దారుణంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద లేదు..ఎవర్ని పడితే వారిని..ఎంతమాటొస్తే అంత మాట అనేసారు. కనిపించిందన్నల్లా దోచేశారు..దాచేసారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఎవర్ని వదిలిపెట్టం అని తేల్చి చెపుతుంది. ఐదేళ్లలో దాడులు చేసిన గల్లీ నేత దగ్గరి నుండి మాజీ మంత్రుల వరకు అందరికి శిక్షిస్తాం అని స్పష్టం చేసింది. దీంతో శిక్షల నుండి ఎలా భయపడేలా..అని అంత ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వైసీపీ పాలనపై , జగన్ ఫై విరుచుకపడుతున్నారు. ఈరోజు కూడా అదే విధంగా మండిపడ్డారు. ‘ రిషికొండలో రూ.500 కోట్లతో భవనాలు కడతావా? ప్రజాధనాన్ని నీ విలాసం కోసం వినియోగిస్తావా ?. 2019 లో 151 సీట్లతో గెలిపిస్తే ప్రజలకు నమ్మక ద్రోహం చేశావు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

వినుకొండలో హంతకుడుది ఏ పార్టీ? హతుడిది ఏ పార్టీ?. మొన్నటి వరకు మీ పార్టీలో లేరా?. 36 మందిని చంపారంటున్నావ్‌.. వాళ్ళ పేర్లేంటి?. నిజాయతీ ఉంటే పేర్లు ఇవ్వు. నువ్వు చంపిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇచ్చా. ఆ కేసులు రీఓపెన్ చేస్తా. సిద్ధమా?. హూ కిల్డ్ బాబాయ్ ?. బాబాయ్ హంతకులను పట్టుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది?. వడ్డీతో సహా చెల్లిస్తా. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలన్నీ ప్రజల ముందు ఉంచుతాం..వారిపై కేసులు పెట్టి కఠిన శిక్ష విధిస్తాం ..జగన్‌పై కేసులు రీఓపెన్ చేస్తా..అంటూ బాబు అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. దీని బట్టి చూస్తే జగన్ మళ్లీ జైలు జీవితం గడపడం ఖాయం అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Read Also : IND W vs BAN W: బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ ఖరారు