Jagan Dharna : జగన్ ధర్నా ఫై చంద్రబాబు సెటైర్లు

జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు

  • Written By:
  • Publish Date - July 20, 2024 / 08:18 PM IST

కూటమి సర్కార్ (AP NDA) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా (Jagan Dharna) చేయనున్నట్లు మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తానని.. అనంతరం ప్రధాని మోడీ (PM Modi)ని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ ఢిల్లీ ధర్నా అంశాన్ని బాబు లేవనెత్తారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో మనకు అనవసరమని.. ఆయన ఏం చేస్తారనేది మనకు ముఖ్యం కాదని.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనమేం చేయాలనేది ఇంపార్టెంట్ అని ఎంపీలకు తేల్చి చెప్పారు. జగన్ ధర్నా ఇష్యూను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనన్ని నిధులు రాబట్టాలని సూచించారు. అవసరమైతే ఇందుకు మంత్రుల సహకారం తీసుకోవాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారం మంత్రుల నుంచి తీసుకుని.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అవసరమైతే.. మంత్రులకు కూడా ఢిల్లీకి తీసుకువెళ్లాలని తెలిపారు. జగన్ వ్యాఖ్యలను బాబు లైట్ తీసుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : Hussain Sagar : నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 2 గేట్లు ఎత్తివేత

Follow us