Site icon HashtagU Telugu

Chandrababu: అంబటి బ్రో సినిమా ఇష్యూపై CBN ఫైర్

Chandrababu

New Web Story Copy 2023 08 02t173338.888

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లోని నిర్మాణ ప్రాజెక్టుల్ని పరిశీలించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ తీరుపై ఘాటుగా స్పందించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులంటూ మరో దోపిడీకి తెరలేపారంటూ ఆరోపించారు. కొత్తగా 10 ప్రాజెక్టుల పేరుతో 12 వేల కోట్లు కాజేయాలని సీఎం జగన్ అనుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గండికోట రిజర్వాయర్ పనుల్ని పరిశీలించేందుకు చంద్రబాబు కాలినడకన కొండలపైకి నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ తీరుని ఎండగట్టారు. పాత ప్రాజెక్టుల్ని పట్టించుకోని సీఎం కొత్త ప్రాజెక్టులంటూ దోపిడీకి యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ప్రాజెక్టుల పేరుతో ఈ సారి 12 వేల కోట్లని దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నాడని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తే పేరు ఎవరికీ వెళ్తుందోనని అభద్రతాభావంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక ప్రాజెక్టుల గురించి నేను మాట్లాడుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి సమయంలో బ్రో టాపిక్ ఆ శాఖ మంత్రికి ఎక్కువైందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా, మంత్రి పెద్దారెడ్డికి 600 కోట్ల బిల్లులు క్లియర్ చేసినట్టు చంద్రబాబు ఆరోపించారు. నాలుగేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదని, పలుమార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ఏం చేశారో ఆయనకే తెలియాలన్నారు.

Also Read: AP Volunteer: వివాహితను పెట్టుకెళ్ళిపోయిన వాలంటీర్: వైసీపీ రెబల్ ఎంపీ