శనివారం ఉండవల్లిలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్థిక స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ముఖ్యమంత్రి చర్చించారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి సంక్రాంతి కానుక (Sankranti Gift)ను అందించారు. మొత్తం రూ. 6700 కోట్లు బిల్లుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లు ఈ ఆదేశాలతో లబ్ది పొందనున్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్, సరెండర్ లీవులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కింద రూ. 1300 కోట్లు విడుదల చేయనున్నారు. రూ. 519 కోట్లు జీపీఎఫ్, పోలీసు శాఖకు నాలుగు సరెండర్ లీవుల పెండింగ్ బిల్లులు విడుదల చేయనున్నారు.
Delhi Polls : ఫిబ్రవరి 5తో విపత్తు వీడుతుంది : అమిత్‌షా
విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద రూ. 788 కోట్లు విడుదల చేశారు. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఈ నిధులతో లబ్ది చేకూరుతుంది. అంతేకాకుండా, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు రూ. 10 లక్షల లోపు ఉన్న అన్ని బిల్లులు విడుదల చేస్తామని, దాదాపు 26,000 మంది కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. రైతుల కోసం కూడా ముఖ్యమంత్రి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్‌పోర్ట్ భూములు ఇచ్చిన రైతులకు రూ. 244 కోట్లు కౌలు చెల్లింపుగా విడుదల చేయనున్నారు. అంతేకాక, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ఆసుపత్రులకు చెల్లింపుల కోసం రూ. 400 కోట్లు, డ్రగ్స్ మరియు మెడిసిన్స్ కోసం రూ. 100 కోట్లు విడుదల చేశారు. ఈ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ చర్యలు రాష్ట్ర ప్రజలలో సంతోషాన్ని నింపాయి. రేపటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.