CM Chandrababu: ఈ రోజు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. సీఎం అడిగిన పలు ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, సీనియర్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పురోగతిని పరిశీలించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు కేటాయించిన బడ్జెట్‌ను రూ.10,000 నుంచి రూ.25,000 వరకు పెంచినట్లు ఈ సమావేశంలో పవన్ చంద్రబాబుకు వివరించారు. ఈ నెల 23 తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పెంపొందించేందుకు ప్రస్తుతం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ అభివృద్ధిలో ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది.
అంతేకాకుండా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలనే గతంలో ఉన్న నిబంధనను రద్దు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించిందని ఆయన ధృవీకరించారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచే యోచనలో కూడా చర్చ జరిగింది, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వం పరిశీలనకు ప్రతిపాదనలు తీసుకు వచ్చింది.
Also Read: Warren Buffett: లిప్ స్టిక్ కంపెనీలో వారెన్ బఫెట్ పెట్టుబడులు, దిగ్గజాలు షాక్